NTV Telugu Site icon

Vijayawada: ఫ్రీడం ఫైటర్స్‌ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.

Vijayawada

Vijayawada

Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్‌ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన కూడళ్లలోని ప్రభుత్వ భవనాల గోడల మీద, ఫైఓవర్ల పైన వేసిన స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పాత బస్టాండ్‌ కాంపౌండ్‌ వాల్స్‌ను పీబీ సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విద్యార్థులు గొప్పగా తీర్చిదిద్దారు.

భారతదేశాన్ని బ్రిటిష్‌ పాలకుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు నాటి యోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, అలుపెరగకుండా సాగించిన ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా స్టూడెంట్స్‌ చిత్రాలు గీశారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (వీఎంసీ) ఈ పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. ఈ అరుదైన కాంపిటీషన్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఒకరికి మించి మరొకరు తమ క్రియేటివిటీని, స్కిల్స్‌ను సెంట్‌పర్సెంట్‌ ప్రదర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్ర వంటి చారిత్రక ఘట్టాలను అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించారు.

Jana gana mana-telangana: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో ‘జన గణ మన’ ఒక నిత్య ఆలాపన

ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే స్లోగన్లను చూడచక్కగా, ఆకర్షించేలా రాశారు. మన్యం వీరుడు అల్లారి సీతారామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, బాల గంగాధర్‌ తిలక్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.. ఇలా పలువురు ఫ్రీడం ఫైటర్స్‌ను సచిత్రంగా సిటీలో కొలువుదీర్చారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ మీద వేసిన పెయింటింగ్స్‌ అటు వైపు వెళ్లేవాళ్లను చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తికాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వీఎంసీ ఈ పోటీలను ఏర్పాటుచేసింది. విజేతలకు ఇండిపెండెన్స్‌ రోజున బహుమతులను అందించనుంది.

స్వాతంత్ర్యోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీఎంసీ చేసిన కృషిని స్థానికులు మెచ్చుకుంటున్నారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్ని భాగస్వాములను చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఈసారి ఇండిపెండెన్స్‌ డే ఈవెంట్స్‌ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విజయవాడవాసులతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజానీకంలో జాతీయ భావం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

Show comments