Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన కూడళ్లలోని ప్రభుత్వ భవనాల గోడల మీద, ఫైఓవర్ల పైన వేసిన స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పాత బస్టాండ్ కాంపౌండ్ వాల్స్‌ను పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు గొప్పగా తీర్చిదిద్దారు.
భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు నాటి యోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, అలుపెరగకుండా సాగించిన ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా స్టూడెంట్స్ చిత్రాలు గీశారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ఈ పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. ఈ అరుదైన కాంపిటీషన్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఒకరికి మించి మరొకరు తమ క్రియేటివిటీని, స్కిల్స్‌ను సెంట్‌పర్సెంట్ ప్రదర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్ర వంటి చారిత్రక ఘట్టాలను అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించారు.
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్‌డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
Jana gana mana-telangana: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో ‘జన గణ మన’ ఒక నిత్య ఆలాపన
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్లను చూడచక్కగా, ఆకర్షించేలా రాశారు. మన్యం వీరుడు అల్లారి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇలా పలువురు ఫ్రీడం ఫైటర్స్‌ను సచిత్రంగా సిటీలో కొలువుదీర్చారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద వేసిన పెయింటింగ్స్ అటు వైపు వెళ్లేవాళ్లను చూపు తిప్పుకోనివ్వట్లేదంటే అతిశయోక్తికాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వీఎంసీ ఈ పోటీలను ఏర్పాటుచేసింది. విజేతలకు ఇండిపెండెన్స్ రోజున బహుమతులను అందించనుంది.
స్వాతంత్ర్యోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీఎంసీ చేసిన కృషిని స్థానికులు మెచ్చుకుంటున్నారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్ని భాగస్వాములను చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఈసారి ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్‌ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విజయవాడవాసులతోపాటు మొత్తం రాష్ట్ర ప్రజానీకంలో జాతీయ భావం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?