NTV Telugu Site icon

జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెయిర్

విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు.

Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్

అటు జనవరి 3న రావిశాస్త్రి శత జయంతి సభ, 4న పుస్తక ప్రియుల ర్యాలీ నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాల గంగాధర తిలక్‌ శత జయంతి సభ, 6వ తేదీ సాయంత్రం ఆత్రేయ శత జయంతి సభ, 7వ తేదీ సాయంత్రం వడ్డాది పాపయ్య శత జయంతి సభ జరుగుతుందన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి డిసెంబర్ 27 వరకు బుక్ ఫెయిర్ నిర్వహించనున్నారు.