టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. పృథ్వీ తన భార్య శ్రీలక్ష్మికి ప్రతినెలా రూ.8 లక్షల భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని ఆదేశాలు జారీ చేశారు.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)తో 1984లో వివాహం జరిగింది.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, పృథ్వీరాజ్ విజయవాడలోని నా జన్మస్థలంలో ఉండి సినిమాల్లో నటించేందుకు చెన్నై వెళ్లేవాడు.. ఆ ఖర్చులన్నీ మా తల్లిదండ్రులే భరించారు.. కానీ, నన్ను తరచూ వేధించేవాడు. 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేశారు.. దీంతో, తాను పుట్టింటికి వచ్చేశాను.. అక్కడే ఉంటున్నాను అంటూ ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
Read Also: Supreme Court: అబార్షన్ కోసం వచ్చే మైనర్ల వివరాలు పోలీసులకు చెప్పనక్కర్లేదు..
ఇక, తన భర్త సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని, అతడి నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాలని 2017 జనవరి 10న కోర్టును ఆశ్రయించారు శ్రీలక్ష్మి… కేసు నేపథ్యాన్ని పరిశీలించిన జడ్జి… నటుడు పృథ్వీరాజ్.. కేసు వేసినప్పటి నుంచి అతని భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ప్రతినెలా 10వ తేదీలోగా మెయింటెనెన్స్ చెల్లించాలని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది కోర్టు.. కాగా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా.. నటుడు పుథ్వీరాజ్ చాలా పాపులర్ అయ్యారు.. గత ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగా పనిచేసిన ఆయనకు టీటీడీ చానల్ ఎస్వీబీసీకి ఛైర్మన్ పదవి దక్కింది.. అయితే, ఓ వివాదంలో చిక్కుకున్న ఆయన పదవి కోల్పోయారు.. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఈ మధ్యే మెగా బ్రదర్ నాగబాబును కలిసి జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.