Site icon NTV Telugu

VijayaSai Reddy: చంద్రబాబుకు కాలం చెల్లింది.. రాష్ట్రం నవ్యాంధ్ర కాబోతోంది..!!

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పిన నిఖార్సైన నిజమని.. ఇప్పుడు చంద్రబాబు తుప్పు అని.. కాదు కాదు వృద్ధ నారీవ్రత, సతివ్రత కూడా అని చురకలు అంటించారు. అందుకే రాష్ట్రం నవ్యాంధ్ర కాబోతుందని విజయసాయిరెడ్డి అన్నారు.

మరో ట్వీట్‌లో ‘టాటా.. టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. చంద్రం అన్నయ్యా. నాకు ఏడుపొస్తుందన్నయ్యా.. నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్యా ఈ నిర్ణయం?’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Exit mobile version