NTV Telugu Site icon

Yogi Vemana University: వేమన వర్శిటీలో వైఎస్ విగ్రహం వివాదం.. వీసీ ఏమన్నారంటే?

Yogi Vemana 1

Collage Maker 10 Nov 2022 03.47 Pm (1)

ఏపీలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పు వివాదాస్నదం అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి.. డా.వైఎస్ ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం స్వంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో మరో వివాదం రచ్చరేపుతోంది. క‌డ‌ప యోగి వేమన యూనివ‌ర్శిటీలో ప్రజా క‌వి యోగి వేమ‌న‌కు అవ‌మానం జ‌రిగింద‌ని, నిర్లక్ష్యంగా గేటు ప‌క్కన పెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు యోగివేమ‌న యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్సల‌ర్ మున‌గాల సూర్యక‌ళావ‌తి. వ‌ర‌ల్డ్ క్లాస్ యూనివ‌ర్శిటీ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు ప్రయ‌త్నిస్తున్న క్రమంలో యూనివ‌ర్శిటీ ప్రాంగణంలో ఉన్న ప్రజా క‌వి యోగివేమ‌న విగ్రహాన్ని ఎలివేష‌న్‌లో తరలించామన్నారు. అందులో భాగంగా ఆయ‌న‌కు ఆగ్రతాంబూలం ఇస్తూ చేసిన మార్పుల‌పై మొన్నటి న్యాక్ క‌మిటీ కూడా అభినందిస్తూ, ఈ మార్పుల‌ను స్వాగ‌తించిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు.

Read Also: Exclusive: అనూష శెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం…

యోగి వేమ‌న ప‌ట్ల యూనివ‌ర్సికి ఎంతో గౌరం ఉంద‌ని, ఆయ‌న ప‌ట్ల చిన్న త‌ప్పు కూడా చేయ‌మ‌ని ఆమె అన్నారు. యోగివేమ‌న త‌రువాత‌, ఈ యూనివ‌ర్శిటీ ఏర్పాటులో కీల‌క భూమిక పోషించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహాన్ని యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌లో ఒక చోటి నుంచి ప్రస్తుతం యోగివేయ‌న విగ్రహం ఉన్న చోట ఏర్పాటు చేసి గౌర‌వించామే త‌ప్ప ఇందులో ఎవ‌రినీ త‌క్కువ చేయ‌డం మ‌రోటి కాద‌ని విసి సూర్యక‌ళావ‌తి స్పష్టం చేశారు. చాలా యూనివ‌ర్శిటీల ఎలివేష‌న్‌లో ఆ యూనివర్శిటీ పేరు ప్రతిబింబించేలా ఆయా వ్యక్తులు, మ‌హానుభావుల విగ్రహాలు పెట్టార‌ని,అదే ప‌ద్దతిని కొత్త ఎలివేష‌న్‌లో తామూ పాటించామ‌ని వీసీ వివ‌రించారు.

Read Also: Drunken Elephants: ఇప్ప సారా తాగిన ఏనుగుల గుంపు..ఆ తరువాత ఏం జరిగిందంటే..

ప్రస్తుతం వేమ‌న విగ్రహం తొల‌గించిన స్థలం వైఎస్ ఆర్ అడ్మినిస్ట్రేటువ్ బ్లాక్‌కు ద‌గ్గర్లో ఉండ‌టంలో సైన్స్ బ్లాక్ దగ్గర ఉన్న వైఎస్ విగ్రహాన్ని చోటు మార్చామ‌న్నారు. అయితే విగ్రహం మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాయ‌ల‌సీమ విద్యార్ధి సంఘం కార్యద‌ర్శి మ‌ల్లెల జ‌గ‌దీష్‌, యూనివర్సిటీ బ‌య‌ట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కింద కాకుండా కాస్త ఎత్తులో ఏర్పాటు చేయాల‌ని కోరారు. కింద‌కు పెట్టడం వ‌ల్ల యోగి వేమ‌న‌ను అవ‌మానించిన‌ట్లు అవుతుంద‌ని చెప్పారన్నారు వీసీ కళావతి. యోగి వేమన విషయంలో వస్తున్న వార్తలపై ఆమె ఈ విధంగా స్పందించారు.