Vasireddy Padma: మహిళా పోలీసులపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మహిళా కమిషన్ కి ఫిర్యాదు అందింది. సచివాలయంలో మహిళా పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం తదితర అంశాలపై గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై మాజీ సీం చంద్రబాబునాయుడు వ్యాఖ్యాలు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Read Also: Hookah Parlour : హుక్కా పార్లర్‌లకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఇటీవల రోడ్ షోలో చంద్రబాబు నాయుడు సచివాలయం మహిళా పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ .మహాలక్ష్మి,, జనరల్ సెక్రటరీ డి. మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు MVN. దుర్గా, గౌస్యా బేగం, మంగళగిరి గీత తదితరులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అమరావతిలోని వారి కార్యాలయంలో ఈరోజు కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం, గ్రామస్థాయిలో మహిళా భద్రత విషయంలో పదిమందికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో గ్రామస్థాయిలో సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సచివాలయం మహిళా పోలీస్ వ్యవస్థ పనితీరుపై, వారు చేస్తున్న సర్వేలపై అబద్దాలను ప్రచారం చేస్తూ..వారికి సహకరించవద్దని వారు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్య భర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారని ప్రజల్లో భ్రమ కలిగే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించవలసిందే అన్నారు. అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం మహిళా పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యాలు సచివాలయం మహిళా పోలీసులను తీవ్రంగా మనోవేదన గురి చేసిందని, ఏపి గ్రామం/వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ దృష్టి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. చంద్రబాబు తీరుపై వాసిరెడ్డి పద్మ అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు వైఖరిని అంతా ఖండించాలన్నారు వాసిరెడ్డి పద్మ.
Read Also: Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!