Varla Ramaiah: ఎన్ హెచ్చార్సీకి వర్ల రామయ్య లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల.
సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడి వేణుగోపాల్ పై ఎస్.ఐ దాడి చేయడం కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనం. హిందూపురం అసెంబ్లీలోని సజీవరాయనపాలెంకు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతున్నారు. ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నాయకులు ఆమె పెన్షన్‌ను తొలగించారు.
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి అతనిపై దాడి అక్రమ కేసు పెట్టారు. జరిగిన వాస్తవాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్.ఐ రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ దాడి చేశారు. బాధితుడిని మరింత బాధించడం అత్యంత దుర్మార్గం.
ఎస్.ఐ తీరు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే.ఇది ఏపీ పోలీస్ మాన్యూవల్‌కు కూడా పూర్తి విరుద్ధం.నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్.ఐ రంగడు ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు.కాబట్టి వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్.ఐ రంగడుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది.పోలీసులే బాధితులపైన దాడులు, వేధింపులు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని వర్ల తనలేఖలో ఎన్ హెచ్చార్సీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
NTPC VIZAG: ఎన్టీపీసీ సింహాద్రి 4 యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!