Site icon NTV Telugu

Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

Vanga Vja

Vanga Vja

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. తాజాగా ఒక సంఘటన ఎన్నో ఊహాగానాలకు దారితీసింది. వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి టీ తాగుతూ కనిపించారు. అసలు సంగతేంటో తెలీదు గానీ చిలువలు పలువలుగా రాజకీయ ఊహాగానాలు విజయవాడ నగరంలో చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సంగతేంటో వంగవీటి రాధా చెప్పాల్సి వచ్చింది. మా ఆఫీస్ పక్కనే జనసేన ఆదివారం సమావేశం పెట్టుకున్నారు. ఈ రోజు నాదెండ్ల మనోహర్ అక్కడికి వచ్చారు. పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారన్నారు వంగవీటి రాధా.

వంగవీటి రాధా… మనోహర్

ఇద్దరం టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. రాజకీయ పరిణామాలు ఏమీ లేవు.. సరదాగా చాలా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నాకు తెలియదు. మీడియా లేనిపోని హడావుడి చేయకండి. టీ తాగడానికి మాత్రమే వచ్చారు.. కలిసి తాగాం అన్నారు వంగవీటి రాధా. జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను. పక్కనే రాధా ఆఫీసు ఉండటంతో ఇక్కడికి వచ్చానన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. మర్యాద పూర్వకంగా రాధాను కలిశాను. మా మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు లేవు. టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాం. కరెంట్ ఎఫైర్స్ కాదు.. కరెంటు ఛార్జీలు గురించి చర్చించామన్నారు నాదెండ్ల మనోహర్. వీరిద్దరి కలయికపై జరిగిన హడావిడి కాసేపు మిగతా విషయాలు పక్కన పెట్టేలా చేశాయి.

Gold Rate: పొద్దున రూ.100 తగ్గి, సాయంత్రం భారీగా పెరిగిన పుత్తడి ధర

Exit mobile version