NTV Telugu Site icon

YSRCP: వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. రచ్చకెక్కిన విభేదాలు

Ycp Machilipatnam

Ycp Machilipatnam

మచిలీపట్నంలో అధికార పార్టీ వైసీపీలో వర్గవిభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయి. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పర్యటనను పేర్ని నాని వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ బాలశౌరి వర్గం భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పేర్ని నాని వైఖరిపై ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పేర్ని నాని జాగీరా అని ప్రశ్నించారు.

మూడేళ్ళ నుంచి సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులకు ఒకసారి తన ప్రత్యర్ధి కొనకళ్ల నారాయణను పేర్ని నాని కలుస్తుంటారని.. తాను కూడా కొల్లు రవీంద్రను కలవాలా అని నిలదీశారు. ముఖ్యమంత్రిని అవినీతి పరుడని విమర్శించిన సుజనా చౌదరి, కామినేని కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. సుజనా చౌదరి పేర్ని నానిని పొగడటం, పేర్ని నాని సుజనా చౌదరిని పొగడటం.. దీని అర్ధం ఏంటన్నారు. తాను ఇకపై బందర్‌లోనే ఉంటానని.. తన కార్యక్రమాల్లో పాల్గొంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానని.. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తానని బాలశౌరి స్పష్టం చేశారు.