NTV Telugu Site icon

Union Minister Murugan : దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లను సన్మానం చేసుకునే సమయం

Murugan

Murugan

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లను సన్మానం చేసుకు నే సమయమన్నారు. మూడు వ సారి అధికారం వచ్చామని ఆయన తెలిపారు. తెలుగు దేశం,జనసేన తో కలిసి వెళ్లామని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’దేశం అభివృద్ధి చేయడం. గత 10 సంవత్సరాల లో అభివృద్ధి వేగం. డబుల్ ఇంజన్ సర్కార్. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లాగా. రాష్ట్రం లో అభివృద్ధి.. ఆంధ్రప్రదేశ్ లో 5లక్షల కోట్ల అభివృద్ధి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు.. ట్రైబల్ యూనివర్సిటీ అనుమతి మంజూరు చేశాం.
ఫిషర్ మెన్ కి తొలి మంత్రి ని కి ఏర్పాటు చేసింది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. పోర్ట్ లు డవలప్ చేసాం. 2047 అభివృద్ధి ప్రణాళిక విశ్వ గురు స్థానం. సత్య మంగళ ఫారెస్ట్ లో రైతులు డిజిటల్ మార్కెట్. ఒక లక్షా 20కోట్ల స్టొర్ట్ ప్ కంపెనీలు. నరేంద్ర మోడీ రియల్ హీరో. ఆయనది సోషల్ జస్టిస్. రాజ్యాంగ ఉల్లంఘనలు కు పాల్పడింది కాంగ్రెస్.. ఇండియా అలయన్స్.. రాజ్యాంగం తూట్లు.. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపి లకు అభినందనలు’ అని మురుగన్‌ అన్నారు.