NTV Telugu Site icon

Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.. కానీ,

Minister Kaushal Kishore

Minister Kaushal Kishore

Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్‌.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55 కిలోమీటర్ల పొడవుతో 8,300 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో “లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు” కోసం మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయన్నారు.. “పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్” (పీపీపీ) విధానంలో “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఆర్థిక సహాయానికి కేంద్రం ప్రయత్నించింది. కానీ, “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఆర్థిక సహాయానికి నిరాకరించిందని.. పట్టణ రవాణా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా తేల్చేశారు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చెంతో తెలుసా?

ఇక, మెట్రో రైల్ ప్రాజెక్టులు, సమగ్ర రవాణా ప్రణాళికలు, ప్రత్యామ్నాయ విశ్లేషణ నివేదికలు, డీపీఆర్‌ల రూపకల్పన పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్నారు కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వనరుల లభ్యతను బట్టి వీలైనంత మేరకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం పరిశీలిస్తుందననారు.. విశాఖపట్నంతో పాటు ఏపీలోని మరో 9 నగరాలు (ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు)కు “కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్” రూపకల్పనకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు.. అలాగే, విజయవాడ మెట్రో రైల్ కోసం “నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంటిగ్రేషన్ ప్లాన్”, “ఇంటిగ్రేడెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్” రూపకల్పనకు 2018-19లో కేంద్రం 78.44 లక్షల రూపాయలు ఇచ్చిందని పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్‌.

Show comments