సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.. నేను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యం అని హాట్ కామెంట్లు చేశారు ఉండల్లి… ఇక, గతంలో నేను చెప్పినదే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు.. అది నిజం అన్నారు.. అందుకు.. మంత్రి అంబటికి అభినందలు తెలిపారు ఉండల్లి అరుణ్ కుమార్.. గతంలో చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు.
Read Also: AP SSC Supplementary Results: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత
అసలు డాయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ఏవరు ? అని ప్రశ్నించారు ఉండవల్లి… దానికి ఎవరిని బాధ్యులను చేస్తారు..? ఏవరిపై చర్యలు తీసుకుంటున్నారు ? అని నిలదీసిన ఆయన… పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు… ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరిన ఆయన.. నిర్వాసితులను సమాధి చేసే ఆలోచన ఎందుకు ? చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, గతంలోనూ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు.. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు లేదు అంటూ ఘాటు విమర్శలుచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమూ అలాగే ఉందన్న ఆయన.. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు భుజాలకెత్తుకున్నారని నాడు వైసీపీ ప్రశ్నించిందని గుర్తుచేశారు.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఇప్పటి ఇరిగేషన్ మంత్రి చెప్పారు.. ఇందులో నిజముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి పోలవరం బాధ్యతలు ఎందుకు అప్పగించ లేదు..? అని నిలదీశారు ఉండవల్లి.. పోలవరంతో సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి లేదన్నారు. దానిపై గత కారణాలపై కూడా సీరియస్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.