NTV Telugu Site icon

Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్‌.. అయితే, సీఎం జగన్‌ కామెంట్లపై స్పందించనంటూనే హాట్‌ కామెంట్లు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. రాజధానిపై ఏం చేసినా చట్టబద్దత ఉండాలన్న ఆయన.. రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడను.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైన అంశం.. కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను స్పందించను అన్నారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

ఇక, పోలవరం ప్రాజెక్టుపై కేవీపీ దాఖలు చేసిన పిల్‌లో నేను ఇంప్లీడయ్యాను.. 2017 నుంచి విచారణకు కోర్టులో రాలేదన్నారు.. చీఫ్ జస్టిస్ నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్నారని తెలిపారు ఉండవల్లి.. ఛత్తీస్‌గడ్ తరపున అడ్వకేట్ జనరల్‌గా పోలవరం ప్రాజెక్ట్ తరపున వాదనలు వినిపించానని బెంచ్ నుంచి తప్పుకున్నారు. వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్లు సీజే చెప్పారన్నారు.. అయితే, మేం దాఖలు చేసిన పిటిషన్ పై వినడానికి ఏడేళ్లు సమయం పట్టిందని.. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. మరోవైపు, పొలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. సెక్షన్ 90 ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న ఆయన.. 2014 రేట్ల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయం భరిస్తామని కేంద్రం చెబుతోంది.. 2014 రేట్లతో 2023లో ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం అవుతుందా…? అని ప్రశ్నించారు.

Read Also: Etela Rajender : ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారు.. అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అందరు అనుకుంటున్నారు.. కానీ, అది అయ్యే అవకాశం లేదని హాట్‌ కామెంట్లు చేశారు ఉండవల్లి.. చంద్రబాబు 2014 రేట్ల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. ఎలా ఒప్పుకున్నారు చెప్పాలి అని ఆర్టీఐ ద్వారా అడిగితే ఆధారాలు లేవని చెబుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి హైకోర్టు వాదనలు విని ఉంటే మొత్తం అన్ని అంశాలు వివరించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పై కౌంటర్ ఫైల్ చేయలేదు.. ప్రాజెక్ట్ డయా ఫ్రంవాల్ ఉందో లేదో కొట్టుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే డిజైన్‌లో లోపాలు ఉన్నాయా అనేది చూడాల్సి వస్తుందన్నారు. రూ. 35 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టగలదా..? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం ఎలా అయ్యిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం కాలువలు వైఎస్సార్ తవ్వాడు.. ఆర్ అండ్ ఆర్ పూర్తి కాకుండా చంద్రబాబు 70 శాతం ప్రాజెక్ట్ అయ్యిందని ఎలా చెప్తారు..? కాలువలు, రాక్ ఫీల్ డ్యాం, కాఫర్ డ్యాం, స్పిల్ వే, ఆర్ అండ్ అర్ ఇవన్ని కలిపితే పోలవరం ప్రాజెక్టు.. మెయిన్ డ్యాం నిర్మాణం అవ్వకుండా ప్రాజెక్ట్ అయిపోయిందని ఎలా చెబుతారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పై కౌంటర్ దాఖలు చేయలేదు.. కోర్టు మా వాదనలు వింటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

Show comments