Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలు:

★ సికింద్రాబాద్‌-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్‌ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది

★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095) ఏప్రిల్ 1న సా.6:25 గంటలకు బయలుదేరుతుంది

★ తిరుపతి-కాకినాడ (రైలు నం:07598) ఏప్రిల్ 2న రాత్రి 9:55 గంటలకు బయలుదేరుతుంది

★ కాకినాడ-వికారాబాద్‌ (నం:07599) 3న రాత్రి 8:45 గంటలకు బయలుదేరుతుంది

★ తిరుపతి-మచిలీపట్నం (నం:07096) 2న రాత్రి 10:15 గంటలకు బయలుదేరుతుంది

https://ntvtelugu.com/new-rules-implementing-from-april-1st/