NTV Telugu Site icon

Hyderabad: ఇలా చేస్తే కోటీశ్వరులు కావచ్చు.. బంధువులనే బురిడీకొట్టించారు

Untitled 7

Untitled 7

Hyderabad: మనిషి ఎదగాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటివారిని ముంచి ఎదగాలి అనుకుంటేనే ముప్ప్పు. అలానే ఉన్న సంపదను వృద్ధి చేసుకోవాలి అనే ఆశ ఉంటె పర్వాలేదు గాని.. అత్యాశకు పోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది అనడానికి గతంలో చాల ఉదాహరణలు ఉన్నాయి. అయినా కొందరు వ్యక్తులు మాత్రం వారి పంథాను మార్చుకోవడం లేదు. అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చునని ప్రజలను నమ్మించి ఆపై ముంచేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. విజయవాడకు చెందిన గుదే రాంబాబు (48), భీమవరం నివాసి పెన్మెత్స కృష్ణంరాజు (42 ) అనే వ్యక్తులు కలిసి నమ్మిన వారినే నట్టేట ముంచారు. వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చలామణి అయ్యారు. ఈ నేపథ్యంలో చాక్లెట్‌ డిస్ట్రిబ్యూటర్లుగా వ్యాపారం ఆరంభించారు.

Read also:Balaiah: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి

అయితే వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడిగా ఓ వ్యక్తి నుండి 2-3 కోట్లు అప్పు తీసుకున్నారు. అలానే తెలిసిన వాళ్ళను తమ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చునని బంధువులను, తెలిసినవారిని నమ్మించారు. నమ్మి పెద్దుబడి పెట్టిన వ్యక్తులకు మొదట్లో లాభాలు చూపిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆపైన మొఖం చాటేశారు. రోజుకో చోటకి మకాం మారుస్తూ పభం గడుపుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని ఓ ఇంట్లో నివాసం ఉన్నట్లు బాధితులు తెలుసుకున్నారు. అనంతరం బాధితులు ఆ ఇద్దరు నివాసం ఉన్న ఇంటికి వెళ్లి డబ్బు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. దీనితో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పరారైయ్యారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నగర సీసీఎస్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Read also:SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.45 జీతం..

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం బషీర్‌బాగ్‌ లోని నగర సీసీఎస్‌ కార్యాలయంలో ఏసీపీ టీఎస్‌ ఉమామహేశ్వర్‌రావు, డీసీపీ శిల్పవల్లితో కలిసి జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌ మాట్లాడుతూ.. నిందితులు ఇద్దరు 200 మంది నుంచి దాదాపు రూ.530 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామని .. కాగా అందులో బాధితులకు రూ.427 కోట్లు పంచగా.. కార్యాలయం నిర్వాహణకు, ఉద్యోగుల జీతాలకు రూ.50 కోట్లు వ్యాచించినట్లు, అలానే కమీషన్‌ డిస్ట్రిబ్యూటర్లకు, బంగారు వ్యాపారులకు రూ.12 కోట్లు చెల్లింగా.. ఒక్కొక్కరూ రూ.20 కోట్లు చొప్పున ఇద్దరూ పంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. కాగా నిందితుల దగ్గర నుండి 2 కిలోల బంగారు ఆభరణాలు.. అలానే రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నింధితులు రెండు తెలుగు రాష్టాల్లో చాలామందిని మోసం చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.