Wall Collapse: కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. కార్మికులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Read Also: Kadapa: కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్