Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఓ జంట బాపట్ల జిల్లాలు ప్రాణాలు తీసుకుంటే.. మరో జంట తిరుపతిలో ప్రాణాలు వదిలేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది… నగరంలో గోవింద రాజస్వామీ ఆలయ సమీపంలోని త్రిలోక రెసిడెన్షిలో ఉరివేసుకుని బలవర్మణానికి పాల్పడింది ఓ జంట.. వీరిని ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు చెందిన అనూష, హైదరాబాద్‌కు చెందిన కృష్ణరావులుగా గుర్తించారు పోలీసులు. నాలుగు నెలలు క్రితం అనూషకు వేరే వ్యక్తితో పెళ్లి కూడి జరిపించారు కుటుంబసభ్యులు.. కానీ, ఆ పెళ్లి ఇష్టం లేకనే తిరుపతిలో ప్రియుడుతో కలసి అనూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Read Also: Gold and Silver Rate Today: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్..
మరోవైపు.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం అడీవీధిపాలెం గ్రామ శివారుల్లో మరో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది.. మృతులు చినగంజాం మండలం మున్నంగివారిపాలెంకు చెందిన సుబ్బారెడ్డి(25), తేజ(18)గా పోలీసులు గుర్తించారు. మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, తేజలు గత కొంతకాలంగాప్రేమించుకుంటున్నారు. సుబ్బారెడ్డి పదోవతరగతి వరకు చదివి వ్యవసాయ కూలి పనులకు వెళ్తుండగా.. తేజ ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో ఆపేసింది. అయితే, ఇద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. ఇరువురి ప్రేమ వివాహనికి పెద్దలు ఆంగీకరించకపోవడంతో మనస్థాపంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. ఇక, మృతదేహాలను ఫోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మున్నంవారిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి.. మొత్తంగా ఒకేరోజు రెండు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకోవడం ఏపీలో కలకలం రేపుతోంది.