ప్రేమ వ్యవహారం ఒక్కోసారి రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపుతుంది. అది ఘర్షణకు కూడా దారితీస్తుంది. ప్రేమ వివాహం నచ్చక ఇరువర్గాలు మధ్య ఘర్షణ వల్ల రెండు కుటుంబాలు గొడవపడి ఆస్పత్రికి చేరిన ఘటన ఇది. శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చెన్నే కొత్తపల్లి మండలం హరియాన చెరువుకు చెందిన ఒకే కులానికి చెందిన చాణిక్య లక్ష్మీల మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరు 2నెలల క్రితం ఊరు నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు.
అయితే ఇవాళ జంటను పోలీస్ స్టేషన్ కు పిలిపించినట్టు తెలుస్తోంది. తమ అమ్మాయి తమ ఎదురుగాని నమ్మకం నచ్చని వారి ఇంట్లో ఉందన్న ఆగ్రహంతో అమ్మాయి తరఫున బంధువులు చాణిక్య కుటుంబ సభ్యులపై దాడి చేశారు ప్రాణభయంతో చాణిక్య లక్ష్మి ఇద్దరు పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు.లక్ష్మి బంధువులు కుటుంబ సభ్యులు చాణిక్య కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చెన్నే కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధాలు, ప్రేమ పెళ్లిళ్లు గ్రామాల్లో చిచ్చురేపుతున్నాయి.
కందుకూరులో ఘోర ప్రమాదం
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు ప్రమాద స్థలంలో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చుని ఉన్న 15 సంవత్సరాల బాలుడికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వెంటనే 108 ద్వారా కావలి హాస్పిటల్ కి తరలించారు. బాలుడు పరిస్థితి విషమం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు హాస్పిటల్ కు తరలించారు. వీరిద్దరూ ఏ ఊరికి చెందినవారు అని ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుడ్లూరు పోలీసులు.
