Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. సేవా టికెట్ల విడుదలకు సిద్ధమైన టీటీడీ

Ttd

Ttd

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. రేపు ఉదయం అంటే ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది… జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు సంబంధించిన సేవా టికెట్లను రేపు ఉదయం విడుదల చేయబోతోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా వర్చువల్ సేవా టికెట్ల కోటాను రద్దు చేసింది టీటీడీ.. కాగా, శ్రీవారికి సంబంధించిన దర్శనం, సేవా టికెట్లు.. ఇలా ఏవి విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తిస్థాయిలో బుక్‌ చేసుకుంటున్నారు భక్తులు.. కాస్త ఆలస్యం చేసినవారికి టికెట్లు దొరకడం లేదు.. కావున, శ్రీవారి సేవా టికెట్ల కోసం వేచిచూస్తోన్న భక్తులు.. అప్రమత్తంగా ఉండి టైంకి టికెట్లు బుక్‌ చేసుకుంటేనేగాని దొరకని పరిస్థితి ఉంది.

Read Also: Army Officer Suicide: ఆర్మీ అధికారి ఆత్మహత్య.. భార్యను హత్య చేసి..

Exit mobile version