Tirumala Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

  • నేడు నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
  • లక్కిడీప్ విధానంలో కేటాయించే టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ..
  • ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
  • ఎల్లుండి లక్కిడీప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు..
Ttd

Ttd

Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్‌ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

Read Also: ADs Block: మీ ఫోన్‌లోని ప్రకటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే దీన్ని వెంటనే ఇలా సెట్ చేయండి..

×
×
Ad

కాగా, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు నవంబర్‌ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడదల చేయనుంది. ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లను, ఈనెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేయనున్నారు.

Read Also: Pawan Kalyan Janavani: నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర ప్రజావాణి కార్యక్రమం

ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, దివ్యాంగుల టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల.. తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. తిరుమల-తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్నారు.