Site icon NTV Telugu

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ..

Babu

Babu

CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవాళ (ఆదివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దీంతో పాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించనుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో.. సీఎం చంద్రబాబు సూచనతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also: Sitting On Chair: గంటల తరబడి కుర్చీపై కూర్చొని పని చేస్తున్నారా.. ఈ సమస్యలను ఆహ్వానిస్తున్నారని తెలుసా..?

ఇక, టీటీడీ ఈవో అందించిన నివేదికపై నిన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు అని ఈవో శ్యామల రావు చెప్పుకొచ్చారు.

Exit mobile version