శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్‌అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది టీటీడీ.
Read Also: Somu Veerraju: ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమే.. దమ్ముంటే చర్చకు వస్తారా?
ఇక, లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అర్జిత సేవా టిక్కెట్లను పొందేందుకు రేపు (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వరకు భక్తులు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. ఆగస్టు మాసానికి సంబంధించిన కోటాను భక్తులు లక్కీ డిప్ ద్వారా పొందే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు, వర్చువల్ సేవా టికెట్లను ఎల్లుండి విడుదల చేయనుంది టీటీడీ.. జులై, ఆగస్టు మాసానికి సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లను ఎల్లుండి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. మొత్తంగా శ్రీవారి దర్శనానికి, ఇతర సేవల కోసం వేచిచూస్తున్న భక్తులకు ఇది నిజంగా శుభవార్తే.