NTV Telugu Site icon

YV SUbba Reddy: కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు టీటీడీ ఆలయాల నిర్మాణం..

Yv Subba Reddy,

Yv Subba Reddy,

కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి… టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. సైతిక శ్రీవారి శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి… విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి గుడివాడ అమరనాథ్, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, కలెక్టర్ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సముద్ర తీరాన కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు హైందవ ధర్మాన్ని ప్రచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.. కార్తీక దీపోత్సవం కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మారుమూల ప్రాంతాల్లో దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.. ఇక, వెంకటేశ్వర స్వామి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం.. 15000 వేల కోట్లకు పైగా నిధులు ఏ బ్యాంకులో డిపాజిట్ చేశామో వివరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని.. ఇప్పటికే వెంకటస్వామి దేవాలయం వైజాగ్ లో నిర్మించామన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Read Also: TTD : భక్తులకు టీటీడీ శుభవార్త..

మరోవైపు, సముద్ర తీరాన టీటీడీ ఆధ్వర్యంలో మహా దీపోత్సవ నిర్వహించడం సంతోషం ఉందని.. మహా దీపోత్సవ కార్యక్రమంకు టీటీడీ అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ప్రశంసలు కురిపించారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. భక్తుల దగ్గరకే వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువచ్చారు.. గత మూడేళ్ళుగా టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని.. వెంకటేశ్వర స్వామి వెలసిన అద్భుతమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా వేదం నిలబడుతుంది అంటే అది వేంకటేశ్వరస్వామి మహిమ.. కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఉన్న మహిమ ఎక్కడ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో 30 దేవాలయాలను టీటీడీ నిర్మించింది.. హిందు ధర్మ ప్రచారానికి టీటీడీ నడుం బిగించిందన్నారు. కార్తీక మాసంలో మహా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రోజు రోజుకు స్వామివారికి భక్తులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు.. ఇప్పటికే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఋషికొండలో ఏర్పాటు చేశారు.. ఒకవైపు సింహాచలం అప్పన్న, మరొక వైపు వెంకటేశ్వర స్వామి వైజాగ్ లో ఉన్నారని తెలిపారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.