NTV Telugu Site icon

TTD Anga Pradakshina Tokens: నేడు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల..

Tirumala

Tirumala

TTD Anga Pradakshina Tokens: నేడు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అంగప్రదక్షిణ టోకెన్లను జారీ చేనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా వాటిని రిలీజ్ చేయనున్నారు. ఈ కోటా కింద అందుబాటులోకి తీసుకొచ్చే టికెట్ల సంఖ్య.. 250గా ఉంది. ఈ టికెట్లను పొందిన భక్తులు శనివారం అంటే ఆగస్టు 10న తెల్లవారుజామున అంగ ప్రదక్షిణ చేయవచ్చు అని అధికారులు తెలిపారు. కాగా, భక్తులు తడివస్త్రాలతో శ్రీవారికి అంగప్రదక్షిణ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో సంప్రదాయ దుస్తులను ధరించి.. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌ దగ్గర భక్తులు రిపోర్ట్ చేయాలి అని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అక్కడ వారి టికెట్లు, గుర్తింపుకార్డులను టీటీడీ సిబ్బంది తనిఖీ చేసిన తరువాతే ఆలయం లోనికి వెళ్లడానికి అనుమతిస్తారు అని వెల్లడించారు.

Read Also: Dengue: డెంగ్యూ వ్యాక్సిన్ పై కీలక సమాచారం..ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందంటే?

కాగా, శ్రీవారి సుప్రభాత సేవ ఆరంభమైన తర్వాత భక్తులకు అంగప్రదక్షిణకు అనుమతి ఇస్తారు అని టీటీడీ అధికారులు తెలిపారు. సుప్రభాత సేవ కొనసాగుతున్న టైంలో తెల్లవారుజామున 2: 45 నిమిషాలకు తొలుత మహిళలు, ఆ తర్వాత పురుషులు అంగప్రదక్షిణానికి పంపిస్తారని చెప్పారు. శ్రీవారి బంగారు వాకిలి ముందు నుంచి అంగప్రదక్షిణ చేస్తూ ఆలయ ఆవరణలోని హుండీ వరకు వెళ్లాల్సి ఉంటుంది.

Show comments