NTV Telugu Site icon

Employees Transfer: ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. ఆ రెండు శాఖల్లో ట్రాన్స్పర్స్ లేనట్లే..!

Ap Govt

Ap Govt

Employees Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ తప్పని సరి చేసింది సర్కార్.. ఈ నెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసేయాలని ఆదేశాలు ఇచ్చింది. బదిలీలు జరిగే శాఖలు.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయాలు, మైనింగ్, సివిల్ సప్లైయస్, దేవదాయ, రవాణ, అటవీ- పర్యావరణం, పరిశ్రమలు, విద్యుత్‌ , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో పాటు అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్‌ సిబ్బందికి బదిలీలు కంపల్సరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Read Also: CM Siddaramaiah: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..

ఇక, టీచర్లు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత శాఖల ఉద్యోగులకే బదిలీలను కూటమి ప్రభుత్వం పరమితం చేసింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీల వర్తింపు చేసింది. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్య భర్తలు ఉద్యోగులైతే.. ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Read Also: Viral video: రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య.. జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు.. నెటిజన్ల విమర్శలు

అలాగే, ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్‌ బేరర్ల లెటర్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సూచనలు చేసింది. ఆఫీస్‌ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్‌ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టీకరణ చేసింది. స్క్రూట్నీ తర్వాత కూడా పరిపాలన పరంగా అవసరమనిపిస్తే.. తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియకున్నా.. ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని అని ఏపీ సర్కార్ వెల్లడించింది.