NTV Telugu Site icon

Train Derails: పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Train

Train

తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్ళన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ నుండి విజయవాడ లైన్ లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని, ప్రయాణికులు ఈవిషయం గ్రహించాలని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పిఠాపురంలో స్టేషన్ లో నిలిచిపోయాయి యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. పక్కకు తప్పిన ట్రైన్ చక్రంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Read Also: Dil Raju Dauthter Harshitha Reddy Exclusive Interview Live: దిల్ రాజు కొడుకు హర్షిత్ రెడ్డి, కూతురు హర్షిత రెడ్డి ఇంటర్వ్యూ

ట్రాక్ రిపేర్ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. సామర్లకోట పిఠాపురం మధ్య ఒక ట్రాక్ పై ట్రైన్స్ పంపిస్తున్నారు అధికారులు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గంటకి పైగా గోపాల పట్నం స్టేషన్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ (17015) నిలిపివేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

Read Also: Sunil Gavaskar : అలా చేస్తే టీమిండియా వరల్డ్‌కప్ గెలవలేదు: గవాస్కర్