ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే ఏం చేయలని విషయాల్ని వెల్లడించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. ఇప్పటి వరకూ మళ్లీ ట్రోఫీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. 2019 వరల్డ్ కప్‌లో సెమీస్ వరకూ వచ్చి ఓడిపోయింది. అయితే ఆ వరల్డ్ కప్‌లో టీమ్ ఎంపిక విషయంలో జరిగిన తప్పిదమే ఈ ఓటమికి కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పాడు. విదేశీ కామెంటేటర్లు చెప్పిన ప్లేయర్లను తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అతడు అనడం గమనార్హం. “ఇండియన్ టీమ్‌లో ఎవరు ఉండాలని అడుగుతూ మన మీడియా విదేశీ కామెంటేటర్ల దగ్గరికి వెళ్లదని ఆశిస్తున్నా. ఈ కామెంటేటర్లు తమ దేశానికి విధేయులుగా ఉంటారన్న విషయం మరచిపోవద్దు. వీళ్లు ఇండియాకు అవసరం లేని ప్లేయర్స్ పేర్లను సూచించవచ్చు. గత వరల్డ్ కప్‌ల్లో ఏం జరిగిందో చూశాం. ఐపీఎల్లో బాగా ఆడాడని విదేశీ కామెంటేటర్లు చెప్పడంతో ఓ కొత్త ప్లేయర్‌ను తీసుకున్నారు. దీంతో అప్పటికే తనను తాను నిరూపించుకున్న ప్లేయర్‌ను తప్పించారు. కానీ ఆ ఆటగాన్ని తుది జట్టులో పెద్దగా ఆడించనే లేదు” అని గవాస్కర్ చెప్పాడు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కూడా ఆ పదం కలసి వచ్చేనా!?
ఆ ప్లేయర్ ఎవరు అన్నది గవాస్కర్ నేరుగా చెప్పలేదు. అయితే అతడు చెప్పినదాని ప్రకారం చూస్తే.. ఆ కొత్త ప్లేయర్ విజయ్ శంకర్ కాగా.. తనను తాను నిరూపించుకున్న ప్లేయర్ అంబటి రాయుడని తెలుస్తోంది. ఏడాది ముందు నుంచే నాలుగో స్థానానికి తాను సరిగ్గా సరిపోతానని రాయుడు నిరూపించుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రాయుడుపై ప్రశంసలు కురిపించాడు. కానీ వరల్డ్ కప్ సమయానికి విదేశీ కామెంటేటర్లు చెప్పిన విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడు అంతకుముందు ఐపీఎల్లో 244 రన్స్ చేయడంతోపాటు ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం కేవలం మూడు మ్యాచ్‌లే ఆడి 58 రన్స్ చేసి, రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీని కారణంగా టీమిండియా తుదిజట్టులో కచ్చితంగా ఉండే రాయుడులాంటి ఓ ప్లేయర్ సేవలను కోల్పోయింది. ఇదే విషయాన్ని ఇప్పుడు గవాస్కర్ గుర్తు చేశాడు.