ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.
బంగ్లాదేశ్‌కు టర్కీ అధ్యక్షుడి కొడుకు.. భారత్‌కు ప్రమాద హెచ్చరిక..
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించబోతోంది. బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా, భారత సరిహద్దు ప్రాంతాల్లో జమాత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ పరిస్థితిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
‘‘ప్రధాని అవుతావు’’.. ప్రియాంకా గాంధీకి బాబా ఆశీర్వాదం..
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ గురువారం అస్సాంకు వెళ్లారు. ఆమె రెండు రోజుల పర్యటన ప్రారంభమైంది. పర్యటనకు ముందు ప్రసిద్ధి కామాఖ్య ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బాబా(సన్యాసి) ఆశీర్వదించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు గౌహతి ఎయిర్ పోర్టులో దిగిన ప్రియాంకా గాంధీ నేరుగా, కామఖ్య ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో నాగా సాధువుతో ఆమె సంభాషించారు. బాబా ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ.. “హమారా బేటీ ప్రధాన మంత్రి బనేగా (మా బిడ్డ ప్రధాన మంత్రి అవుతుంది)” అని అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గాంధీ ఈ ఆశీర్వాదం తర్వాత చిరునవ్వుతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఏడాది అస్సాంలో జరగబోయే ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే, గత వైభవాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది.
వాహ్ నువ్వు తోపు భయ్యా..! ఒకే మ్యాచ్‌లో 4 వికెట్లు.. 4 క్యాచ్‌లు.. వరల్డ్ రికార్డ్!
టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టు ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో గెలుపు. ఇటలీ మొదటిసారి ఈ ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తగ్గేదేలే అన్న రీతిలోనే మొదట దూసుకుపోయింది. పవర్‌ప్లేలోనే బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్‌మైర్‌లను ఔట్ చేసి వెస్టిండీస్‌ను కాస్త ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలో కెప్టెన్ షాయ్ హోప్ ఓపికగా ఆడాడు. మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నా కెప్టెన్ మాత్రం చివరివరకు నిలబడి 46 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును 165 పరుగుల వరకూ తీసుకెళ్లాడు. ఇటలీ బౌలర్లు క్రిషన్, కెప్టెన్ బెన్ మానెంటీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 165 పరుగుల లక్ష్యంతో ఇటలీ గ్రౌండ్‌లోకి దిగింది. ఈ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మోస్కా సోదరులు వేగంగా పరుగులు తీయడానికి ప్రయత్నించారు. కానీ వెస్టిండీస్ బౌలర్లు ఒక్కసారిగా మ్యాచ్ దిశ మార్చేశారు. షమర్ జోసెఫ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తూ 30 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతనికి తోడుగా మాథ్యూ ఫోర్డ్ సైతం 19 పరుగులకు మూడు వికెట్లు తీసి ఇటలీ ఆశలను చెదరగొట్టాడు. చివరకు ఇటలీ జట్టు 18వ ఓవర్‌లోనే మొత్తం ఔట్ అయింది.
రైతులను పెళ్లి చేసుకుంటే మహిళలకు ప్రోత్సాహకాలు.. సీఎంకు ఎమ్మెల్యే లేఖ..
రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. తుమకూరు జిల్లాలోని కునిగల్ నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రంగనాథ్ తన లేఖలో రైతుల పరిస్థితిని వివరించారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యవసాయంపైనే చాలా కుటుంబాలు ఆధారపడ్డాయని, వ్యవసాయం చేస్తున్న యువకులను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక అలవెన్సులు, ప్రత్యేక హోదా ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను కోరారు.
దేవుడితో 20 లక్షల ప్యాకేజీ ఒప్పందం.. హుండీలో విద్యార్థి లేఖ వైరల్..
సాధారణంగా భక్తులు దేవుడిని కష్టాలు తీర్చమని వేడుకుంటారు. సమస్యల నుంచి బయటపడితే తలనీలాలు సమర్పిస్తామని, కానుకలు ఇస్తామని మొక్కుకోవడం హైందవ సంప్రదాయం. అయితే, ఏలూరు జిల్లాలో ఓ భక్తుడు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, “నాకు ఇది చేస్తే.. నేను నీకు అది చేస్తాను” అంటూ ఏకంగా భగవంతుడితో ముందస్తు ఒప్పందం (Agreement) కుదుర్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం హుండీ లెక్కింపు చేపట్టగా, అందులో ఓ విద్యార్థి రాసిన వింత లేఖ వెలుగుచూసింది.
‘‘రాఫెల్‌తో మీ దేశానికే లాభం, విమర్శలు ఎందుకు.?’’
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. గురువారం మక్రాన్ భారత్‌తో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. రాఫెల్ యుద్ధవిమానాలు భారత్‌ను బలమైన సైనిక శక్తిగా మారుస్తాయని, ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ ఒప్పందం భారత్‌లో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని కూడా చెప్పారు.
గద్దర్ సినీ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి.. జీవో విడుదల చేసిన సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (TGFA) – 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (I&PR) జీవో నంబర్ 236ను విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న విడుదల చేసిన మునుపటి ఉత్తర్వులకు (G.O.Rt. No.166) సవరణగా ఈ కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి.
బంగ్లాదేశ్‌లో హిందూ ఎస్ఐ హత్య కేసు.. ఢిల్లీలో నిందితుడి అరెస్ట్..
బంగ్లాదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, హిందూ పోలీస్ అధికారిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇతను యూరప్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అహ్మద్ రజా హసన్ మెహదీగా గుర్తించారు. ఇతడిని బంగ్లాదేశ్‌కు బహిష్కరించారు. బంగ్లాదేశ్ లోని హబీగంజ్ నివాసి అయిన మోహదీ, ఆగస్టు 5, 2024న ఎస్‌ఐ సంతోష్ చౌదరి హత్య చేశాడు. షేక్ హసీనాను గద్దె దించాలని ఉద్యమం చేసిన సమయంలో ఈ హత్య జరిగింది. పోలీస్ స్టేషన్‌లో దాడికి గురైన సంతోష్ మరణించారు. అతడి మృతదేహాన్ని చెట్టుకు వెలాడదీశారు. ఆగస్టు 5, 2024లో షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత, తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అదే రోజు బంగ్లా వ్యాప్తంగా మైనారిటీలైన హిందువులపై దాడులు జరిగాయి.
యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..
ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ వీడియోలతో గుర్తింపు పొందిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాజమాన్యం తొలగించింది. సుమారు 1.3 మిలియన్ల (13 లక్షలు) మంది ఫాలోవర్లు ఉన్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, ఈ చర్య వెనుక హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు రాసిన లేఖే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దేశాన్ని దూషించారనే ఆరోపణలతో నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమికంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా , దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లు ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిసిఎస్ పోలీసులు తొలుత ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్లకు లేఖ రాసి అన్వేష్ అకౌంట్ వివరాలు సేకరించారు. ఆ వివరాలు అందిన వెంటనే, సదరు ఖాతా ద్వారా మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తక్షణమే ఆ అకౌంట్‌ను తొలగించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు మరో లేఖ రాశారు.
శ్రీలంక గడ్డపై జింబాబ్వే సంచలనం విజయం.. టేబుల్ టాపర్‌గా రజా సేన
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో పెద్ద జట్లను కుదిపేయాలని కెప్టెన్ సికందర్ రజా ఇప్పటికే కంకణం కట్టుకున్నాడు. తాజాగా శ్రీలంక జట్టును ఆ దేశ ఓన్ గ్రౌండ్‌లోనే ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో సూపర్-8కు ముందే గ్రూప్–బీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి భారీ టీమ్‌ను ఓడించి సూపర్-8లోకి అర్హత సాధించిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను సైతం ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే స్థానం చాలా తక్కువ. కానీ ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీలంకను ఓడించడం పెద్ద అప్‌సెట్‌గా మారింది. గత ఏడాది కూడా జింబాబ్వే శ్రీలంకపై రెండు సార్లు గెలిచింది. 2024లోనూ ఒకసారిఓడించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పన్నెండు మ్యాచ్‌లలో శ్రీలంక ఎనిమిది గెలిచినా, జింబాబ్వే నాలుగు విజయాలతో తమ పోరాటస్ఫూర్తిని చూపించింది. కొలంబో ఆర్‌పీఎస్ మైదానం మాత్రం శ్రీలంకకు అదృష్టం కలిగించలేకపోతోంది. అక్కడ ఆడిన 34 మ్యాచ్‌లలో కేవలం తొమ్మిది విజయాలే రావడం బలహీనతను బయటపెట్టింది.
