విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్‌ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ఇండియా కూటమికి అసదుద్దీన్ ఓవైసీ బిగ్ షాక్..
బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్‌లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి.. తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం!
తొలిరోజే ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన చైర్మన్ రాధాకృష్ణ గాంధీ మీడియాతో సమావేశం నిర్వహించారు. మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్‌తో సహా కొంత మంది సభ్యులు ప్రెస్‌మీట్‌కి కూర్చున్నారు. అదే సమయంలో ఈఓ శీనా నాయక్ కూడా అక్కడికి వచ్చారు. మీడియా సమావేశం ఉందని నాకు ఎందుకు తెలియజేయలేదని? అంటూ సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీరే ప్రెస్‌మీట్ నిర్వహించుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
రోజు రోజుకు భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతటి శిక్షలు విధిస్తున్నప్పటికి వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక కారణంతో భర్తలను హత్యచేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. భర్త నిండునూరేళ్లు బతకాలని ఓ భార్య ఉదయమంతా ఉపవాసం చేసింది. సాయంత్రం అదే భర్తకు విషమిచ్చి హత్య చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. అనంతరం భర్తకు విషమిచ్చి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శైలేష్ కుమార్ (32) అనే వ్యక్తికి అతని భార్య సవిత వేరే మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించి విషం ఇచ్చి చంపేసింది.
అమెరికాకు ఇవ్వమని హామీ ఇవ్వండి.. ‘‘రేర్-ఎర్త్’’పై భారత్‌ను కోరిన చైనా..
అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇదిలా ఉంటే, భారత్ కూడా రేర్ ఎర్త్ అయస్కాంతాల కోసం చైనాపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో, భారత్‌కు ఎగుమతి చేసే అరుదైన అయస్కాంతాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదని చైనా, మన దేశం నుంచి హామీ కోరుతున్నట్లు సమాచారం. ప్రపంచంలో ప్రాసెస్ చేయబడిన రేర్ ఎర్త్ మెటీరియల్స్, అయస్కాంతాల్లో 90 శాతం కంటే ఎక్కువ చైనానే ఉత్పత్తి చేస్తోంది. ఈ 17 రకాల అరుదైన మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాల (ev)ల తయారీ నుంచి విమాన ఇంజన్లు, సైనిక రాడార్ల వంటి ఉత్పత్తుల్లో ఇవి కీలకంగా ఉంటాయి.
ముస్లిం దేశంలో బుర్ఖా నిషేధం.. ఇస్లామిక్ దేశాల్లో ఈ దేశం తీరే వేరు!
ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో బుర్ఖా, హిజాబ్ ధరించడం అనేది తప్పని సరి. కానీ ఒక ముస్లిం దేశం మాత్రం బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఇటలీలో బుర్ఖాను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత, దేశంలో బుర్ఖా ధరించడం నిషేధిస్తారు. దేశంలోని బహిరంగ ప్రదేశాలలో బుర్ఖా, హిజాబ్ ధరించడం కొనసాగించే వారికి ₹300,000 జరిమానా విధించనున్నట్లు ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెలువడిన అనంతరం బుర్ఖా, నిఖాబ్, హిజాబ్‌లపై నిషేధం విధించిందిన ముస్లిం దేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఎందుకు ఆ దేశంలో వాటిని నిషేధించారు..
కంట్రోల్ చేస్తున్నా, వదిలితే మా వాళ్లు చాలా చేస్తారు.. మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్!
కల్తీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో గతంలో ప్రజాప్రతినిధులా, ఇప్పుడు వారే రౌడీలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?.. ప్రతీదీ కౌంట్ అవుతుంది, చట్టాలున్నాయి అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి అన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు తన మీద మాట్లాడుతున్నారని.. తన వాళ్లని నేను కంట్రోల్ చేస్తున్నా అని, వదిలితే తమ వాళ్లు చాలా చేస్తారు అని పేర్కొన్నారు. డిఫమేషన్‌కు వెళుతున్నాం అని, ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పేర్ని నాని లిక్కర్ కేసులోనే జైలుకు వెళ్లాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘మొలకల చెరువు కల్తీ మద్యంపై పూర్తి విచారణ జరుగుతోంది. 20 మందిలో 14 మందిని అరెస్టు చేశాం. జనార్ధన్ రావును కూడా కష్టడిలోకి తీసుకున్నాం. కల్తీ మద్యంకు లింక్‌లో ఉన్న వైన్ షాపును సీజ్ చేశాం. ఐదుగురిని అరెస్టు చేసి, 4గురుకి పీటీ వారెంట్ ఇచ్చాం. హైదరాబాద్, బెంగళూరు, మన రాష్ట్రంలో నాలుగు టీంలు పెట్టాం. ప్రతీ షాపుకు క్లియర్ ఇనస్ట్రక్షన్లు ఇచ్చాం. సెబ్ (SEB)ను కూడా ఎక్సైజ్‌లో కలిపి బలమైన ఎన్ఫోర్స్మెంట్ తెచ్చాం. APTATS యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక మందు బాటిల్‌కు సంబంధించిన ప్రతీ అంశం ఈ యాప్‌లో దొరుకుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవి కూడా కంట్రోల్ చేశాం. ఈఎన్ఏ మన రాష్ట్రంలో దొరికేలా చేశాం. ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కడా ఉండకూడదని నవోదయ ప్రోగ్రాం చేస్తున్నాం’ అని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో చెప్పారు.
క్యూనెట్ మోసానికి యువకుడి బలి.. సిద్ధిపేట జిల్లాలో విషాదం
సిద్దిపేట జిల్లాలో మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ కంపెనీ క్యూనెట్ మోసానికి ఒక యువకుడు బలయ్యాడు. వర్గల్ మండలం వేలూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ (26) అనే యువకుడు ఇటీవల ఒక స్నేహితుడి సూచన మేరకు క్యూనెట్ కంపెనీలో చేరాడు. కంపెనీ ప్రతినిధులు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల 15 వేల రూపాయలు రెగ్యులర్‌గా వస్తాయని హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మొత్తం 4 లక్షలు చెల్లించాడు. అయితే ఆ తర్వాత కంపెనీ మాట మార్చింది. తాను తీసుకున్న లింక్ కింద మరో వ్యక్తిని చేర్చి, అతను కూడా 4 లక్షలు చెల్లిస్తేనే డబ్బులు వస్తాయని హరికృష్ణకు తెలియజేశారు. ఈ షరతుతో యువకుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. తాను మోసపోయాననే భావనతో తీవ్ర మనోవేదనకు లోనైన హరికృష్ణ చివరికి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరేయలేవంటూ నన్ను సీఐ రెచ్చగొట్టాడు.. నేను కూల్‌గానే మాట్లాడా!
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మచిలీపట్నం ఆర్‌ఆర్ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారని ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును పేర్ని నాని కలిసి వివరణ ఇచ్చారు. సీఐ తనను రెచ్చగొట్టాడని, తాను కూల్‌గానే మాట్లాడానని తెలిపారు. ‘నేను సీఐపై దాడి చేయలేదు. ఆయనే లేచి నిలబడి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా నేను కుర్చీలోనే కూర్చుని కూల్‌గా మాట్లాడా. నన్ను నువ్వు అట్లా అంటావా, ఇట్లా అంటావా అని మాట్లాడాడు. నన్ను నువ్ ఏం ఉరేయలేవన్నాడు. నువ్ మేకల సుబ్బన్నను కూడా ఉరేయలేవన్నాను. అతను గట్టిగానే మాట్లాడాడు, నేను కూడా గట్టిగానే మాట్లాడా. ఎస్పీ గారు.. నేను ప్రజా జీవితాల్లో పాతికేళ్లు ఉన్నాను. కావాలంటే ఇపుడున్న గుంటూరు ఐజీ గారు ఎక్కడ ఎస్పీగా చేశారు. ఆయన దగ్గరకు బోలెడన్నిసార్లు ఫిర్యాదుల కోసం వెళ్లాను. మాకు ఆయన కనబడితే అడగండి.. పేర్ని నాని ఎప్పుడైనా పోలీసుల మీద దాడి చేశాడా? అని’ అని పేర్ని నాని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధైర్య పడొద్దు.. రైతులకు అండగా ఉంటా!
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు.
