TCS ఉద్యుగులకు షాక్.. వారందరికీ అప్రైజల్స్ స్టాప్ అంటూ..!
ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ ‘హైబ్రిడ్’ మోడల్‌ను అనుసరిస్తుంటే టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని కచ్చితమైన నిబంధన పెట్టింది. అంతేకాకుండా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోని కొన్ని త్రైమాసికాల్లో (జూలై-సెప్టెంబర్ 2025) అటెండెన్స్ నిబంధనలను పాటించని ఉద్యోగుల అప్రైజల్స్ నిలిచిపోయాయి. ఆపరేషనల్ లెవల్‌లో ప్రక్రియ పూర్తయినా.. కార్పొరేట్ విభాగం వీటికి క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం. ఈ చర్యతో ప్రధానంగా కొత్తగా చేరిన వారిపై పడుతోంది. ఎందుకంటే 2022లోనే టీసీఎస్ లాటరల్ హైర్స్ (అనుభవం ఉన్న వారు) కోసం వార్షిక అప్రైజల్ విధానాన్ని రద్దు చేసింది. ఆ తర్వాతి త్రైమాసికాల్లో కూడా నిబంధనలు పాటించకపోతే, ఆ ఉద్యోగులను FY26 బ్యాండింగ్ సైకిల్ నుండి పూర్తిగా మినహాయిస్తామని కంపెనీ హెచ్చరించింది. అంటే ఆ ఏడాదికి వారికి ఎలాంటి పర్ఫార్మెన్స్ బ్యాండ్ కేటాయించబడదు. దీనితో అది వారి జీతాల పెంపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.
హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్‌లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), మియాపూర్ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44 లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని గతంలోనే ‘హైడ్రా ప్రజావాణి’కి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. నిజానికి గతంలోనే ఇదే సర్వే నంబర్‌లో ఉన్న 5 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అలాగే మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 18 షట్టర్లను కూడా అధికారులు గతంలోనే తొలగించారు.
నదీ గర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు..! జగన్‌కు సీఎం కౌంటర్..
రాజధాని అమరావతిపై మరోసారి రచ్చ మొదలైంది.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని నిర్మాణం విషయంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి కూటమి మంత్రులు, నేతలు కౌంటర్ ఇవ్వడంతో.. హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మరోవైపు, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. నదీ గర్భం (River Bed)కు, నదీ పరివాహక ప్రాంతం (River Front)కు మధ్య ఉన్న తేడా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి రాజధానిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానట్లేదని ఆయన మండిపడ్డారు.
హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడమే నా కల.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు..!
జనవరి 15న ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో పౌర ఎన్నికలు జరగనున్నాయి. మరుసటి రోజు (జనవరి 16)న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రాజ్యాంగ హక్కులు, సుపరిపాలన అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని AIMIM గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రచారం చేస్తున్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి దేశ అత్యున్నత పదవులను అధిష్టించే హక్కును కల్పించింది అంటూ ఒవైసీ కొనియాడారు. అయితే పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తి మాత్రమే ప్రధాని కావడానికి అవకాశం ఉందని.. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చని ఆయన పేర్కొన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తులతో జాగ్రత్త.. పవన్ కీలక సూచనలు..
మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులతో అప్రమత్తంగా ఉండాలి అంటూ కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని పవన్ స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్‌పీకి కొత్త చీఫ్
బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్‌పీ పార్టీకి కొత్త ఛైర్మన్ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగ్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది లాంటింది. బీఎన్‌పీ పార్టీ చీఫ్ ఖలీదా జియా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీకి శుక్రవారం ఆవిడ కుమారుడు తారిక్ రెహమాన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బంగ్లా మీడియా నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) స్టాండింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా రెహమాన్ నియామకాన్ని ఆమోదించింది.
వైసీపీ మాస్ పార్టీ.. జగన్ ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది వస్తున్నారు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబుకు ముఖ్య బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇక, వైసీపీ స్థాపించినప్పటి నుంచే పార్టీ సంస్థాగత నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి వరకు వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంస్థాగత నిర్మాణాన్ని ఒక మహాయజ్ఞంగా చేపట్టామని పేర్కొన్నారు. జగన్ ఒక్కరితో ప్రారంభమైన పార్టీ ఈ రోజు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాది మంది కార్యకర్తల పార్టీగా మారిందని అంబటి రాంబాబు అన్నారు.
175 నియోజకవర్గాల్లో వెంటనే ప్రారంభించండి.. సజ్జల కీలక ఆదేశాలు
తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు వర్క్‌షాప్‌లో కీలక సూచనలు చేశారు.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ కమిటీల నియామకాలన్నీ వెంటనే పూర్తిచేయడంలో అనుబంధ విభాగాలు అన్నీ ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు.. కమిటీల నియామకాలన్నీ డిజిటలైజేషన్ జరగాలి.. గ్రామ, వార్డు కమిటీలకు సంబంధించిన ప్రతి డేటా కూడా పకడ్బందీగా డిజిటలైజ్ చేయాలి.. డిజిటల్ మేనేజర్లతో పాటు ఐటీ, సోషల్ మీడియా విభాగాల నుంచి కూడా ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున ఇరవై మంది పూర్తి సమన్వయంతో పనిచేయాలి. 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం వెంటనే ప్రారంభం కావాలని ఆదేశించారు..
ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ వరకు ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు.. తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య జరగనుండగా.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి- మార్చి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్‌డివిజనల్, సబ్‌డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
