వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా మోపబోతున్న కేసులు ఏంటి?
వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో పాటు రష్యా, ఇరాన్‌లు దాడులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే, మదురోపై అమెరికాలో న్యాయ విచారణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆయన వెనిజులా ప్రెసిడెంట్ కారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. అమెరికా అటార్నీ జనరల్ ముదురోను వాషింగ్టన్ కోర్టు ముందు ప్రవేశపెడుతామని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మదురోకు డ్రగ్స్ కార్టెల్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదురోపై ‘‘నార్కో-టెర్రరిజం’’ కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’.. టీజర్ రిలీజ్
భారతీయ సినీ చరిత్రలో ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమాలు సృష్టించిన అద్భుతాలు మనకు తెలుసు, అయితే ప్రస్తుతం అంతా కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మళ్ళీ అలాంటి సాహసమే చేస్తోంది ‘గాంధీ టాక్స్’ చిత్ర బృందం. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అదితి రావు హైదరీ వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పి. బెలేకర్ మాటలు లేని ఒక మూకీ చిత్రంగా మలుస్తున్నారు. “మౌనంగానే ప్రేమించడం, పాపం చేయడం మరియు ఇబ్బందులు పడటం” అనే ఆసక్తికరమైన అంశంతో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. మాటలు లేని చిత్రాలకు సంగీతమే ప్రాణం కాబట్టి, టీజర్‌లో వినిపించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ ట్యూన్ మరియు కాయిన్ శబ్దాలను బట్టి చూస్తే, నేటి సమాజంలో డబ్బు మరియు మనుషుల అవసరాల చుట్టూ సాగే ఒక సరికొత్త కథాంశం ఇందులో ఉండబోతోందని అర్థమవుతోంది. ఇటీవల ‘భ్రమ యుగం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు, జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మౌన పోరాటాన్ని ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్..
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) వేదికపై.. మరోసారి భావోద్వేగానికి లోనై, ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించారు. గత 25 ఏళ్లుగా ఈ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న బిగ్ బీ, సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే కేటాయించానని, సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్‌గా ఉండటం తన అదృష్టమని ఆయన ఎంతో ఆవేదన వ్యాక్తం చేశారు. 17 సీజన్లుగా అమితాబ్ చూపించిన ఆత్మీయత, ప్రోత్సాహమే ఈ షోకు ఊపిరిగా నిలిచాయి. అయితే ఈ ఫినాలేలో ఆయన ఇంతలా ఎమోషనల్ అవ్వడంతో, కేబీసీకి ఇదే చివరి సీజనా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అగస్త్య నంద సందడి, కికు శారదా కామెడీ మరియు బిగ్ బీ ప్రత్యేక సంగీత ప్రదర్శనతో ఈ ముగింపు ఎపిసోడ్ భావోద్వేగాల పండుగలా సాగనుంది. ఈ అద్భుత ప్రయాణం ఇక్కడితో ముగుస్తుందా లేక మరో సీజన్‌తో మళ్ళీ మొదలవుతుందా అనేది తెలియాలంటే ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
నా అన్వేషణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి మహిళా కమిషన్..!
ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ “నా అన్వేషణ” చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. సదరు ఛానల్‌లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు భారీస్థాయిలో ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. ప్రధానంగా మహిళలను వస్తువుల్లా చిత్రీకరించడం, వారి పట్ల అసభ్యకరమైన , అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేవలం మహిళల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, కొన్ని వీడియోలలో బాలల హక్కులను ఉల్లంఘించేలా , చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. దీనికి తోడు హిందూ దేవతలపై అత్యంత అభ్యంతరకరమైన, భావోద్వేగాలను దెబ్బతీసేలా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటువంటి ప్రవర్తన సామాజిక నైతికతను , సమాజంలోని సమతుల్యతను దెబ్బతీస్తుందని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం సదరు యూట్యూబర్ భారతదేశం వెలుపల నివసిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం జాతీయ మహిళా కమిషన్ (NCW)కు బదిలీ చేసింది.
వెనిజులా చమురుపై ట్రంప్ చూపు.. మదురో అరెస్ట్ తర్వాత సంచలన వ్యాఖ్యలు..
వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, అమెరికా తీసుకువచ్చారు. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు. అమెరికాలోకి డ్రగ్స్ సరఫరాకు వెనిజులా పాత్ర ఉందని, డ్రగ్స్ సూత్రధారులతో మదురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా అమెరికాలోకి వెనిజులా ఖైదీలను బలవంతంగా పంపిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే, చాలా మంది అంతర్జాతీయ నిపుణులు ట్రంప్ వెనిజులా చమురు, సహజ వనరులను కొల్లగొట్టేందుకు దాడులకు తెగబడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు నిజం చేకూరుస్తూ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులా చమురు పరిశ్రమల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయని శనివారం అన్నారు. మాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీలు ఉన్నాయని, అవి వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీలో పాల్గొంటాయని అన్నారు.
కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్.!
తెలంగాణ శాసనసభలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కంటే, చట్టసభలో మాట్లాడే మాటలకు ఎంతో విలువ , బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా, వారు సభకు రాకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకపోవడం విచారకరం గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. “కేసీఆర్ గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తారని మేము ఆశించాం. గతంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వారిని అవమానించినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము సభకు వచ్చి మా వాదన వినిపించేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలు సభకు రాకపోవడం వల్ల అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది” అని ఆయన అన్నారు.
9 రోజులు 9 ఊర్లలో ‘శంకర వరప్రసాద్ గారు’ హంగామా!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ముందు నుంచి కూడా ప్రతి ఒక్క అప్ డేట్ ను కొత్త గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ గట్టి ప్లానే వేశారు. సినిమా మార్కెటింగ్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు, ఇప్పుడు చిరు సినిమా కోసం ఏకంగా 9 రోజుల్లో 9 వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఈవెంట్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే ఈ ప్రమోషన్స్ జాతర 11వ తేదీ వరకు నాన్-స్టాప్‌గా సాగనుంది. రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్, తాడేపల్లిగూడెం, అనంతపూర్, వరంగల్, చివరగా బెంగళూరులో ఈ హంగామా ఉండబోతోంది.
సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?
అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. డ్రగ్స్ రవాణా, అక్రమ వలసలకు ఆ దేశం కారణమవుతుందని ట్రంప్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, యూఎస్ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించామని, దేశం నుంచి బయటకు తీసుకెళ్లినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. మదురోను చట్టం ముందు నిలబెడుతామని అమెరికా చెబుతోంది. ఇదిలా ఉంటే, మదురో అరెస్ట్ తర్వాత గతంలో లిబియా నియంత మహ్మద్ గడాఫీ, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఘటనలు గుర్తుకు వస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా అమెరికా దాడుల తర్వాతే శిక్షలతో మరణించారు. ఇప్పుడు మదురో కూడా ఇదే గతి పడుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఎముకలకు బలం ఇచ్చే.. నేతి బెల్లం సున్నుండలు
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘సున్నుండలు’ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పంచదారకు బదులుగా బెల్లం వాడితే రుచితో పాటు ఐరన్ కూడా అందుతుంది. ఈ వీడియోలో చూపించిన సులభమైన తయారీ విధానం ఇక్కడ ఉంది. ముందుగా మందపాటి గిన్నెలో మినుములను వేసి లో-ఫ్లేమ్ (మంట తక్కువగా ఉండాలి) లో కనీసం 15-20 నిమిషాల పాటు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. వేయించేటప్పుడు చివరిలో బియ్యం కూడా కలిపి వేయించాలి. వేయించిన మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పిండిలా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మరోసారి ఒక రౌండ్ తిప్పితే పిండి, బెల్లం బాగా కలిసిపోతాయి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, వేడి చేసిన నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు చుట్టుకోవాలి. అంతే.. ఒక్క ఉండ తింటే చాలు.. బలానికి బలం, రుచికి రుచి.
