ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు. దీనిని సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటుతారు. సొరంగాలు తవ్వుతారు, కంచెలు దాటుదారు. ప్రవేశించిన తర్వాత దేశ చట్టాలు తమకు వర్తిస్తాయని అంటున్నారు. ఆహారం, ఆశ్రయం, పిల్లలకు విద్య హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. మనం చట్టాన్ని ఇలా అందరికి అక్రమవలసదారులకు కూడా విస్తరించాలని అనుకుంటున్నారా?’’ అని అడిగారు. మన దేశంలో కూడా పేదలు, పౌరులు ఉన్నారు, వారిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
అందుకే.. సంచార్ సాథీ యాప్..
కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ ఫ్రాడ్‌లకు గురయ్యారు. ఇప్పటి వరకు రూ.23 వేల కోట్లు ప్రజలు నష్టపోయారని ఆయన తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్నవారే ఎక్కువగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ..
డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొనడానికి 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిటైర్ అయ్యి క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌కు గురి చేశాడు వాస్తవానికి ఈ స్టార్ ప్లేయర్ రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో చేరలేదు. ఐపీఎల్ 2026కి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. ఐపీఎల్ 2026 వేలంలో ఆయన తన పేరును నమోదు చేసుకోలేదు.
“మరణం” వార్తలకు చెక్.. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..
గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీటీఐ కార్యకర్తలు, ఆయన అభిమానులు జైలు ముందు ధర్నాలు చేశారు. ఇమ్రాన్ సోదరీమణులు నిరసన తెలిపారు. అయితే, పోలీసులు తమ జట్టుపట్టుకుని ఈడ్చేశారని వారు ఆరోపణలు చేయడం సంచలనంగా మారాయి.
ముగిసిన రెండో విడత నామినేషన్ల గడువు..
తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 4332 సర్పంచ్ స్థానాలకు 12479 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
సహాయంలోనూ నీచంగా ప్రవర్తించిన పాకిస్తాన్..
సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్‌పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు ఇప్పించి, నేతలను రాజీనామా చేయించేందుకు ఒత్తిడి తెస్తారని ఆరోపించారు.
చంద్రబాబు కేసుల ఉపసంహరణ చట్ట విరుద్ధం
ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి పిపిపి మోడల్‌ను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని బొత్స తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఎక్కడా విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణలో లేవని, ప్రజలకు ఈ సేవలను అందించడం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. గవర్నర్ అపాయింట్ మెంట్ లభించిన వెంటనే ఆ సంతకాలను సమర్పిస్తామని ప్రకటించారు.
‘‘కుక్క వివాదం’’.. రేణుకా చౌదరికి మద్దతుగా రాహుల్ అనుచిత వ్యాఖ్యలు..
పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్‌కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు కుక్క ప్రధానాంశంగా నిలిచింది. ఆ చిన్న కుక్క ఏం చేసింది.? ఇక్కడికి కుక్కలకు అనుమతి లేదా?’’ అంటూనే, పార్లమెంటు భవనాన్ని చూపిస్తూ, “కానీ వారిని లోపలికి అనుమతించారు” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీ, ఎన్డీయే నేతల గురించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి.
ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీకి అగాధమైన అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది కూడా ఇదే నేలలోనని గుర్తు చేశారు. 1969లో ప్రారంభమైన ఉద్యమం 60 ఏళ్ల పాటు కొనసాగడానికి పాల్వంచ కీలక భూమిక వహించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర అపారమని పేర్కొన్న సీఎం, అందుకే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకీ ఆయన పేరును పెట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ఖమ్మం జిల్లానే మొదటి అడుగుగా నిలుస్తుందని, ఈ జిల్లాను చూసినప్పుడల్లా తన హృదయం ఉప్పొంగుతుందని రేవంత్ అన్నారు. శ్రీరాముడి సాక్షిగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి దిశగా నడిపిస్తానని హామీ ఇచ్చారు.
