Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్.. ఎక్స్ కి నోటీసులు

సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో నెటిజన్స్ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ మహిళలపై అసభ్యకరమైన చిత్రాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బికినీలో, డ్రెస్ రిమూవ్ అంటూ గ్రోక్ ను ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X కి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు X AI సర్వీస్ ‘గ్రోక్’ కు సంబంధించినది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన, లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించడానికి, వ్యాప్తి చేయడానికి గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ నోటీసు జారీ చేసింది. X, AI సర్వీస్ ‘గ్రోక్’ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, IT నియమాలు, 2021 ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారత్‌లోని ఈ రెండు గ్రామాలు ఏకంగా హనుమంతుడినే బహిష్కరించాయి.. ఎందుకో తెలుసా?

మనదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లో కచ్చితంగా హనుమంతుడి గుడి ఉంటుంది. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తప్ప కుండా ఆరాధిస్తారు. కానీ రెండు గ్రామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా రామ ధూత హనుమంతుడిని బహిష్కరించాయి. వాస్తవానికి.. మన దేశంలోని దాదాపు అన్ని గ్రామాలు దేవుళ్లు, దేవతలకు అంకితమై ఉంటాయి. ఒక్కో ఊరిలో ఒక్కో గ్రామ దేవీదేవతలు ఉంటారు. కానీ కొన్ని అరుదైన గ్రామాలు మాత్రం భిన్నమైన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లోని బిస్రఖ్ గ్రామంలో రావణుడిని పూర్వీకుడిగా భావించి పూజిస్తారు. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు రాక్షసుడైన దైత్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. ఈ కారణంగా ఆ గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు ఉండవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో మారుతి (Maruti) కంపెనీ కార్లు కూడా కనిపించవు. “మారుతి” అనే పేరు సంస్కృతంలోని “మరుత్” (గాలి) అనే పదం నుంచి వచ్చింది. వాయు పుత్రుడు అయిన హనుమాన్‌ పేరు కావడంతో గ్రామస్థులు ఆ పేరుని కూడా దూరంగా ఉంచుతారు. ఆ గ్రామాల్లో మొదటిది మహారాష్ట్రలోని నందూర్ నింబ దైత్య. ఇది అహ్మద్‌నగర్ జిల్లా పాఠర్ది తాలూకాలో ఉంది.

‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..

దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్‌ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అంతా హర్యానా ఫరీదాబాద్‌‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులుగా తేలింది. నవంబర్ 10న ఎర్రకోట పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. మరో ముగ్గురు వైద్యులు ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథర్, షహీనా సయీద్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.

డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే సరి..!

డ్రోన్ కెమెరాలతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. జూద కార్యకలాపాలైన, ఆకతాయిల వేధింపులైన, బహిరంగ మద్య సేవనమైన, చట్ట వ్యతిరేక చర్యలు ఏవైనా వారి ఆట కట్టిస్తామని కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తున్నారు. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లపాడు గ్రామ పరిధిలో పేకాట ఆడటానికి వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పేకాట ఆడుతున్న 12 మంది జూదగాళ్లను గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి రూ.33,950 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరోవైపు.. మల్లాయపాలెం గ్రామ శివారులో టిడ్కో గృహాల వద్ద పేకాట ఆడుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పేకాట ఆడుతున్న 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.4500 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో డ్రోన్ నిఘాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితం వస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా అనేక క్రైమ్‌లను అరికట్టవచ్చని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!.. ఈ నంబర్‌కి సమాచారం ఇవ్వండి..

సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్‌ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లను ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, దినపత్రికలను & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి మీరు ఇంట్లో లేరనే విషయాన్ని దొంగలు గమనిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది. ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం, లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.

శ్రీకాకుళం రైల్వే ప్రయాణీకుల కష్టాలకు చెక్.. ఫలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి!

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రైల్వే స్టేషన్లలో హాల్టులు మంజూరయ్యాయి. ఇకపై బెర్హంపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18525/18526) తిలారు స్టేషన్‌లో ఆగనుంది. అలాగే పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (12843/12844) ఇచ్చాపురం స్టేషన్‌లో, భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22819/22820) బారువ స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రయాణీకులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

శ్రీకాకుళం రైల్వే ప్రయాణీకుల కష్టాలకు చెక్.. ఫలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి!

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రైల్వే స్టేషన్లలో హాల్టులు మంజూరయ్యాయి. ఇకపై బెర్హంపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18525/18526) తిలారు స్టేషన్‌లో ఆగనుంది. అలాగే పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (12843/12844) ఇచ్చాపురం స్టేషన్‌లో, భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22819/22820) బారువ స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రయాణీకులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ టాప్.. విస్తుపోయే గణాంకాలు..

దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతానికి పైగా వాటాను దక్కించుకుని ఏపీ మరోసారి తన సత్తాను చాటింది. పారిశ్రామిక వృద్ధిలో ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు కేంద్రబిందువుగా మారిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘గ్రాఫిక్ ఆఫ్ ది డే’లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా ఏపీ ఎదుగుదల ఉందని ఫోర్బ్స్ ఇండియా ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని ఆ గ్రాఫిక్ వెల్లడించింది.

ముగిసిన స్నేహం.. మొదలైన యుద్ధం.! అన్వేష్ కాంట్రవర్సీలో ‘ఏయ్ జూడ్’ సంచలన వీడియో

సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్, పాపులర్ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. హిందూ దేవతలపై అన్వేష్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్, ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హిందూ భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్‌పై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వివాదం ప్రభావం ఆయన యూట్యూబ్ ఛానెల్‌పై కూడా పడింది; రోజురోజుకూ ఆయన సబ్‌స్క్రైబర్స్ సంఖ్య భారీగా పడిపోతోంది.

న్యూ ఇయర్ కానుక.. 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ షురూ..

నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపడతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. వేలాది గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సంబరంగా మొదలైంది.. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

 

Exit mobile version