Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం.. బాధితుల ఆత్మహత్యాయత్నం

పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు. పురుగుల మందు, పెట్రోల్ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు బెదిరింపులకు దిగారు. తాము తాకట్టు పెట్టిన 15 తులాల బంగారం షాపు యజమాని ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అయితే, ఆందోళన నేపథ్యంలో యజమాని బంగారం షాపు గేటుకి తాళం వేసేశాడు. ఆరేళ్లుగా తిరుగుతున్న తమ బంగారు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ బంగారం ఇస్తే తమ ఇంటిలోనూ బాధితులు కట్టుకుంటామని చెబుతున్నారు. బంగారం దుకాణం ముందు భారీగా చేరిన ప్రజలు.. ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు సర్ది చెప్పి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

నెలల తరబడి హుండీలో దాచుకున్న డబ్బు.. తీరా హుండీ పగలగొట్టి చూస్తే…

ఒకప్పుడు మనం డబ్బులు దాచుకోవాలంటే.. గళ్ల గురిగిలోనే.. పోపుల డబ్బాలోనే.. బీరువాలోనో దాచుకుంటాం. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ లో పొదుపు చేసుకుంటున్నాం. ఇంత వరకు బాగానే ఉన్న .. ఓ మహిళ తాను ఎన్నో నెలల నుంచి సంపాదించిన డబ్బు గళ్ల గురిగిలో దాచుకుంది. గురిగి బరువెక్కిందని సంతోషంతో ఆ గళ్ల గురుగుని పగుల గొట్టింది. గురిగి పగులగొట్టి చూడగానే ఆమె షాక్ కు గురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గూగుల్‌ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. డేటా సెంటర్‌కి అనుబంధంగా ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి..

ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. కానీ, గూగుల్‌ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. డేటా సెంటర్‌కి అనుబంధంగా పవర్‌, వాటర్‌, ఫుడ్‌.. ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. స ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వస్థతలో ఏపీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సూర్యభగవానుని పరిసరాల్లో స్వచ్చత కార్యక్రమం చేశాం.. 25 లక్షల మోక్కలు నాటాం.. సైకిల్ ట్రాక్ లు నగరంలో ఏర్పాటు చేస్తాం.. సైకిల్ ఫర్ సండే సైకిల్ రూట్ లను ఏర్పాటు చేస్తాం అన్నారు.. గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. నభూతో నా భవిష్యత్తుగా అభివర్ణించారు.

జైపూర్‌లో ఆకట్టుకుంటున్న బంగారం స్వీట్స్.. ధరెంతో తెలుసా!

దీపావళి అంటేనే గుర్తొచ్చేది విద్యుత్ దీపాలు.. కొత్త బట్టలు.. రకరకాలైన స్వీట్లు. సందడి.. సందడి వాతావరణం. ఇంటిల్లిపాది టపాసులు కాల్చడం.. ఇలా దీపావళికి ఎన్నెన్నో కొత్త సంగతులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. రకరకాలైన పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అందులో స్వీట్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. స్వీట్స్ బాక్సులను గిఫ్ట్‌లుగా కూడా ఇస్తుంటారు. దీంతో దీపావళి సమయంలో స్వీట్స్‌ షాపులకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే అన్ని స్వీట్స్ షాపుల్లో అమ్మినట్టుగా అమ్మితే స్పెషల్ ఏమంటుందని అనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ జైపూర్‌లో ఒక స్వీట్‌మేకర్ మాత్రం బంగారం స్వీట్లు విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు దాని స్పెషల్ ఏంటి? దాని ఖరీదు ఎంతో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నాకు డూప్ అవసరం లేదు.. 119 కుట్లు పడ్డా నా స్టంట్స్ నేనే చేస్తాను
తమిళ్‌, తెలుగు సినిమాల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశాల్ మరోసారి తన రిస్కీ సీన్లతో చర్చల్లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్‌లో ఎన్ని సార్లు గాయపడినా, స్టంట్స్‌ చేయడం మానలేదని చెప్పారు. విశాల్ యాక్షన్ ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. పందెం కోడి, భీమా, పయన్, అభిమన్యుడు, లాఠీ, మార్క్ ఆంటోనీ వంటి సినిమాల్లో ఆయన చేసిన ఫైట్ సీన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. ప్రతి సినిమాలో కొత్త యాక్షన్ డిజైన్, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ వస్తున్నాడు.

క్రికెట్‌లో నయా ఫార్మాట్.. టెస్ట్- 20 ఫార్మాట్ రూల్స్ ఏంటి..?

క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. “టెస్ట్ -20” పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్‌లా రెండు ఇన్నింగ్స్ ఉండగా, టీ20 తరహాలో వేగంగా సాగబోయే ఈ కొత్త రూపం అభిమానులకు వినూత్న అనుభూతిని ఇవ్వబోతోంది. ఛాంపియన్​షిప్ టోర్నీలాగా ఆడించాలని నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణీ భావిస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్ తొలి రెండు ఎడిషన్లు భారత్​లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌‌ను విజయవంతం చేసి, ఆ తర్వాత ఫారిన్ దేశాలను విస్తరిస్తామని తెలిపారు. అయితే.. 13 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ క్రికెట్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్‌ను రూపొందించారు. ఈ ఫార్మాట్‌లో రెండు జట్లు ఒకే రోజున తలో 20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి. అంటే మొత్తం 80 ఓవర్లు ఒకే రోజు పూర్తవుతాయని చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టెస్ట్ తరహాలో జరుగుతాయట.

ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. పాక్ మొత్తం బ్రహ్మోస్ పరిధిలో ఉంది..

పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

సూపర్ జీఎస్టీ వల్ల రాష్ట్రానికి 8 వేల కోట్ల నష్టం..

న్యూ ఆర్టీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన రావుతో కలిసి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇక, మంత్రి నారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం ప్రతి నెలా తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఒక్కో నెల ఒక్కొక్క థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర కొరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. గాలి కాలుష్యం వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది చనిపోతున్నారు అని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.

కల్తీ మద్యం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని మంత్రి పార్థసారథి తెలిపారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుంది.. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది.. గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని మండిపడ్డారు. ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఎన్నికల్లో చూశాం.. మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయట పడుతున్నాయి.. దీంతో కల్తీ మద్యం పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. నాటి వైసీపీ పాలనలో మద్యంలో సైతం హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది.. ఈ రోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని పార్థసారథి చెప్పుకొచ్చారు.

వారందరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తాం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న పంజాబ్ లోని అమ్రుత్సర్ విచ్చేసిన కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గురుదాస్ పూర్ జిల్లాలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శించారు. ఇటీవల వచ్చిన భారీ వరదల పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 23 జిల్లాలు వరద ప్రభావితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,097 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. 3,88,092 మంది ప్రజలు వరదలవల్ల నష్టపోయారు. 56 మంది మరణించారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇదులో దాదాపు 3 లక్షల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిన్నది. భారీగా ఆస్తి, పశు సంపద నష్టం సంభవించింది. 10 వేలకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

 

Exit mobile version