Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. కాగా, డిమాండ్‌కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఇక, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని.. దీంతో ధరలు అమాంతం పెరిగాయని పేర్కొంటున్నారు.
Read Also: Deepika Padukone : దీపికా పడుకొనే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
అయితే, గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు టమాట పంట నాశనం అయింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలు, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే టమాటా పంట దిగుబడి కూడా ఆగిపోవడంతో ధరలు పెరిగినట్లు కూరగాయల వ్యాపారులు పేర్కొంటున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో కేజీ టామాట ధర రూ. 50 నుంచి 60 వరకు పలుకుతుంది. ఇక, మిగతా జిల్లాల్లో 35- 45 వరకు పలుకుతుంది. మరికొన్ని రోజుల పాటు అతి భారీ వర్షాలు, వరదలతో టామాట పంట తీవ్రంగా దెబ్బ తింది. మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
