దీపికా పదుకొణే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఏంటా న్యూస్ అనే క్యురియాసిటి కలుగుతోందా. అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని కల్కి బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వన్ ఇయర్ నుండి మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోన్న దీపికా ఇప్పుడే మళ్లీ మేకప్ వేసుకోబోతుంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ వంద రోజులు కేటాయించిందని సమాచారం.
Also Read : Mammootty : మలయాళ మెగాస్టార్ ‘మమ్ముట్టి’కి ఏమైంది ఇప్పుడెలా ఉంది?
బన్నీ- అట్లీ ప్రాజెక్టు కోసం స్పిరిట్ వదిలేసుకున్న భామ.. నవంబర్ నుండి సెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే తన క్యారెక్టర్‌కు సంబంధించి ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని కన్నా ముందే షారూఖ్ ఖాన్ కింగ్ సెట్‌లోకి స్టెప్ ఇన్ కావాల్సి ఉంది భామ. అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్టోబర్ నుండి అడుగు పెట్టాల్సి ఉండగా సడెన్లీకి కింగ్ ఖాన్‌కు మేజర్ ఇంజ్యూరీ అయ్యింది. దీంతో సినిమాను ప్రొడక్షన్ టీం ప్రస్తుతానికి హల్ట్ చేసింది. షారూఖ్ రికవరీ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు షారూఖ్, దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. అందుకే కింగ్ ఖాన్ మరో సారి ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో కింగ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు ఇంట్రడ్యూస్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలు నెక్ట్స్ ఇయర్ అంతా షూట్స్ జరుపుకోనున్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన 2025 మరియు 2026లో మేడమ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించదు. అంటే రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటుంది అనమాట.