1ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు.
2.ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా కలకలం సృష్టిస్తోన్న సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు.. సినీ పరిశ్రమను వేధిస్తోన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌ను సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, ఎస్‌ఎస్ రాజమౌళి, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కలిసిన విషయం తెలిసిందే.. ఈ భేటీతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఉన్నారు.
3.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు.
4.హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ ముఠాను పట్టుకుంది నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్. ఇటీవలే నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఆధ్వర్యంలో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది ఎన్ఎస్‌డబ్ల్యూ.
5.ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నమాట.. అయితే, మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగడంలేదు.. ఇలాంటి సమయంలో మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదన్నారు.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..
6.ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్నది. అమెరికా సైతం ఇప్పటికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జర్మనీలో ఉన్న మరో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు పయనయ్యారు. దీంతో పాటు, మరో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభవిస్తే రష్యాతో నేరుగా తలపడకుండా నాటో దళాలకు సహకరించాలన్నది అమెరికా ఆలోచన.
7.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె.. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడిన ఆమె.. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారని…
8.ఐపీఎల్ వేలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలం పాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు వేలాన్ని ఆపేశారు. అయితే అతడికి ఏమైందనే విషయం ఇంకా తెలియరాలేదు. అప్పటికి శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగా రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఈ ఘటనతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు.
9.రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పైలట్ అవసరం లేకుండానే నడిచే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ల ప్రయాణాన్ని రద్దుచేస్తుంటారు. కానీ, పైలట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలికాఫ్టర్లను తయారు చేస్తున్నారు.
10.ప్రవీణ్ సత్తార్ ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ (ఎల్.బి.డబ్ల్యూ’)’ తో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మీద అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలోనే వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో సిద్ధూ మాస్ హీరోగా జనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతనిలోని అదర్ క్వాలిటీస్ కూడా బయట పడ్డాయి. ఇప్పుడు మరోసారి మల్టీటాలెంట్ ను ప్రదర్శిస్తూ సిద్ధు చేసిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ సినిమాకు మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టారు బట్ ట్రెండీగా ఉండాలని ‘డీజే టిల్లు’గా మార్చారు. అది తెలివైన నిర్ణయం అనిపిస్తోంది. ఈ మూవీ శనివారం జనం ముందుకొచ్చింది.
