* ఎన్టీవీ, భక్తి టీవీ కోటిదీపోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఇవాళ ప్రారంభం.. నవంబర్ 14 వరకూ జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం
* ఏపీ హైకోర్టులో నేడు చింతకాయల విజయ్ భార్య సువర్ణ రిట్ పిటిషన్ పై విచారణ… సెర్చ్ వారెంట్ లేకుండా విజయ్ ఇంట్లోకి ఎలా వస్తారని.. పిల్లల్ని ఎలా విచారిస్తారంటూ సువర్ణ రిట్ పిటిషన్ దాఖలు.
* ఇవాళ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్ధానం భూముల పిటిషన్ పై విచారణ
*తొలి కార్తీక సోమవారం కావడంతో పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాలలో భక్తులు రద్దీ
*నేడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు పురస్కరించుకొని నేడు కొండారెడ్డి బురుజు నుంచి రాజ్ విహార్ వరకు యూనిటీ రన్, ప్రతిజ్ఞ
* న్యాయవాదులపై దాడులకు నిరసనగా నంద్యాల జిల్లాలో నేడు విధులు బహిష్కరించనున్న బార్ అసోసియేషన్ సభ్యులు
* నేడు రాజమండ్రిలో వై.సి.పి కాపు ప్రజాప్రతినిధుల సమావేశం… రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో భేటీ