Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events December 15, 2022

*ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభ.. కరీంనగర్ర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణంలో సభకు హాజరుకానున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

*తిరుమలలో రేపు సాయంత్రం నుంచి ధనుర్మాస నెల ప్రారంభం.. ఎల్లుండి నుంచి నెల రోజులపాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు.. ఎల్లుండి నుంచి జనవరి 14 వరకు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో శ్రీవారికి మేల్కోలుపు

*ఇవాళ తిరుప‌తి నుంచి క‌డ‌ప‌కు ప్రత్యేక విమానంలో రానున్న త‌మిళ స్టార్ రజినీకాంత్ .. అమీన్ పీర్ ద‌ర్గాకు ద‌ర్శించుకోనున్న ర‌జ‌నీకాంత్‌…ద‌ర్గాలో ప్రత్యేక ఫాతేహే నిర్వహించనున్న త‌మిళ స్టార్‌.. ద‌ర్గా ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రత్యేక భ‌ద్రతా ఏర్పాట్లు

*సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

*గుంటూరులో ఈ నెల 17 నుంచి 22 వరకు నగరంలో గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు

*ఈనెల 18న సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర.. బహిరంగ సభ కు హాజరుకానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

*క‌డ‌ప‌లో నేటి నుంచి బ్రహ్మంగారి మనుమ‌రాలు ఈశ్వరీ దేవి ఆరాధ‌నోత్సవాలు… 20వ వ‌ర‌కు సాగ‌నున్న ఆరాధ‌న‌. ఉత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తిసిన మ‌ఠం నిర్వాహ‌కులు

*కాకినాడలో నేడు అన్నవరం రానున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి

*భవాని దీక్షలు సందర్భంగా విజయవాడ నగరంలో 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు….ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలకు అనుమతి రద్దు…హైకోర్ట్, సెక్రటేరియట్ ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి మీదుగా మళ్లింపు

Exit mobile version