Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Srinivasa Rao: తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు సార్వత్రిక ఎన్నికలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తుందని, అభ్యర్థులపై తుది నిర్ణయం ఆ కమిటీలోనే ఉంటుందన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి తుది నిర్ణయం తీసుకుంటుందని.. మేయర్ పదవులపై బీజేపీ, జనసేనకు వారి డిమాండ్లు ఉన్నాయని, అభ్యర్థుల ఎంపికకు సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడే అవకాశం ఉందని, అలా పార్టీ మారిన వెంటనే వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు పల్లా శ్రీనివస్.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిని వీడలేదని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, టీడీపీ, జనసేన పేర్లతో విదేశాల్లో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకం వంటి అంశాలపై కూటమి నాయకత్వం వరుసగా చర్చలు జరుపుతోన్న విషయం విదితమే..
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
తాజావార్తలు
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?