Site icon NTV Telugu

CPI Narayana: కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం..! ఆ ఉగ్రవాదులను అప్పగించాకే పాక్‌తో చర్చలు జరపాలి..!

Cpinarayana

Cpinarayana

CPI Narayana: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనలో కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్‌లో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘావర్గాలకు తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్‌ అప్పగించాలని డిమాండ్‌ చేశారు.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే పాక్‌తో భారత్ చర్చలకు వెళ్లాలని సూచించారు.. ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదన్నారు..

Read Also: Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ నేతలే దేశం విడిచి వెళ్లిపోవాలని మండిపడ్డారు నారాయణ.. నక్సలైట్లను చంపేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం సరైన పద్ధతి కాదన్న ఆయన.. అరాచకాలను సృష్టించే ఉగ్రవాదులతో కేంద్రం మాట్లాడేటప్పుడు.. నక్సలైట్లతో ఎందుకు మాట్లాడకూడదు? అని నిలదీశారు.. అమిత్ షా వెంటనే నక్సలైట్లను చర్చలకు పిలవాలి.. నక్సలైట్లను చంపొచ్చు.. కానీ, వారి సిద్ధాంతాలను చంపలేరన్నారు.. ఇక, ఆపరేషన్ సిందూర్‌లో యుద్ధం చేసిన సోఫియాపై బీజేపీ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.. విజయ్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.. మరోవైపు.. వైఎస్‌ జగన్ కూడా బీజేపీ ఆడుతున్న ఆటలో కీలుబొమ్మే అని వ్యాఖ్యానించారు.. బీజేపీని వ్యతిరేకించే వారిని కలుపుకుని తాము ముందుకు వెళ్తామని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..

Exit mobile version