NTV Telugu Site icon

CM Chandrababu: నారావారిపల్లెలో బిజీబిజీగా సీఎం చంద్రబాబు

Babu

Babu

CM Chandrababu: ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.

Read Also: YS Jagan London Trip: నేడు లండన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు..

ఇక, తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పండుగ సందర్భంగా ఆనందంగా గడుపుతున్నారు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు ఆటలపోటీలు నిర్వహించారు. చిన్నారులంతా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోనె సంచి రేసు, భుజం నెట్టడం, మ్యూజికల్ ఛైర్, బెలూన్ బ్లాస్టింగ్ లాంటి పోటీల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీ హైస్కూల్‌ అభివృద్ధికి భూమిపూజ చేశారు. నారావారిపల్లెలో 3 కోట్లతో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న మహిళా సంఘాలకు సరకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్‌ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్‌ అండ్‌ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.

Show comments