NTV Telugu Site icon

Tirupati Tension: తిరుపతి రాయల్ నగర్‌ దగ్గర ఉద్రిక్తత

Tpt Tension

Tpt Tension

తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి బందరి కాలనీ, రాయల్ నగర్ వద్ద ఇళ్ళు కూల్చివేత టెన్షన్ వాతావరణం సృష్టించింది. 40 ఏళ్ళుగా తామిక్కడ నివాసం వుంటున్నామని, తమ అధీనంలో ఉన్న ఇళ్ళను ఇక్కడ ప్రజా ప్రతినిధులు కబ్జా చేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఖరీదైన స్థలం కావడంతో కబ్జా దారుల కన్ను పడిందని మహిళలు ఆరోపిస్తున్నారు.

తిరుపతి రెవెన్యూ అధికారులు, పోలిసుల సమక్షంలో కబ్జాలు చేస్తున్నారని మహిళలు అడ్డుకున్నారు. తమ ఆధీనంలో ఇళ్ళకు అన్ని రకాల పత్రాలు వున్నాయని, అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు తెచ్చి తమ ఇళ్ళను కూల్చివేశారని బాధితులు మండిపడుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని వారు వాపోయారు.

ఓ ప్రజా ప్రతినిధి ఆదేశాలతో కార్పొరేటర్ సహకారంతో కబ్జాలు చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. రెవిన్యూ అధికారులు తమ ఇళ్ళను కూల్చాలంటే నోటీసులు వుండాలని, అవి చూపించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోయారు. ఏ నోటీసులు లేకుండా తమ ఇళ్ళను ఎలా కూలుస్తారని, ఇంత అరాచకమా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు.తమను ఇబ్బంది పెట్టిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, ఎవరి వత్తిడితోనే పనిచేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవంటున్నారు. అధికారం అండతో స్థానిక ప్రజాప్రతినిధులు పేదలపై ఇళ్ళపై పడుతున్నారని బాధితులు అంటున్నారు.

MLC Anantha Babu: కారులో డ్రైవర్ మృతదేహం.. తీవ్ర కలకలం!