NTV Telugu Site icon

Warning to Singer Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్‌.. ఇక్కడ అడుగుపెట్టనివ్వం..!

Sravana Bhargavi

Sravana Bhargavi

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు రాశారు.. పాడారు.. అయితే, ఆ కీర్తనలను శృంగారభరితంగా చిత్రీకరించి వివాదాల్లో చిక్కుకున్నారు ప్రముఖ సినీ గాయని శ్రావణ భార్గవి.. అన్నమయ్య తనయుడు రచించిన ఒకపరి ఒకపరి వయ్యారమై అనే పాటను రీ క్రీట్ చేసిన ఆమె.. తన ఆఫీషియల్ యూట్యూబ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.. ఆ వీడియోలు శ్రావణ భార్గవి కనిపించిన విదానమే వివాదానికి కారణం అయ్యింది.. ఇప్పుడు శ్రావణ భార్గవికి వార్నింగ్‌ ఇచ్చారు తిరుపతి వాసులు.. తిరుపతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తారు… అన్నమయ్య సంకీర్తనలను స్వామివారిపై పాడుకుంటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో ఉంటోంది.. కానీ, ఒకపరి ఒకపరి వయ్యారమై సంకీర్తనను శ్రావణ భార్గవి తనకోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరం అంటున్నారు.. శ్రావణ భార్గవిని తిరుపతిలో అడుపెట్టనివ్వమని హెచ్చరిస్తున్నారు.

Read Also: Srisailam Dam Live : శ్రీశైలం గేట్లు ఎత్తివేత…| Ntv

ఒక సెలబ్రిటీని అనే గర్వంతో శ్రావణ భార్గవి.. అన్నమయ్య కుటుంబంతో మాట్లాడారు అని మండిపడుతున్నారు తిరుపతి వాసులు.. ఆమెను తిరుపతిలో అడుగుపెట్టనివ్వం.. తిరుమల దర్శనానికి ఆమెను పంపకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.. ఇక, వెంటనే శ్రావణ భార్గవి అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.. తక్షణమే ఆ పాటను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని సూచించారు.. మరోవైపు, టీటీడీ ఎందుకు ఈ వ్యవహారంపై స్పందించడంలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రావణ భార్గవి పాటపై టీటీడీ అధికారులు స్పందించాలి.. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు తప్పుగా చిత్రీకరించకుండా ఒక చట్టాన్ని టీటీడీ తీసుకురావాలి అంటున్నారు తిరుపతి వాసులు.

కాగా, తన వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం అవడం, విమర్శలు రావడంపై స్పందించిన శ్రావణ భార్గవి.. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదు.. మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చారు.. ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు.. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం.. నా ప్రాబ్లం కాదు.. మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.. ఇక, నేనేం లిరిక్స్‌ మార్చలేదు.. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని.. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు అని ఆమె కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే, రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ వ్యవహారం.. ఇంకా ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.