క్షణికావేశం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. తిరుపతిలో అగ్గిపెట్టె ఇవ్వలేదని హత్యకు పాల్పడ్డాడో రౌడీ షీటర్. అగ్గిపెట్టె ఇవ్వలేదని వ్యక్తిని దారుణంగా హతమార్చిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈనెల 24వ తేదీ ఎస్వీ యూనివర్సిటీ పీఎస్ పరిధిలో జరిగిన భిక్షగాడి హత్య సంచలనం కలిగించింది. ఈ కేసును చేధించిన పోలీసులు హత్యకు గల కారణం తెలుసుకుని అవాక్కయ్యారు. 70 ఏళ్ల లక్ష్మణరావును బీడీ వెలిగించడం కోసం అగ్గిపెట్టె అడిగాడు మణిరత్నం. అగ్గిపెట్టె ఇవ్వకపోగా తనను తిట్టాడన్న కారణంగా లక్ష్మణరావుని బండరాయితో మోది చంపేశాడు మణిరత్నం.
Read Also: 26/11 Mumbai Attacks: పోలీస్ త్యాగానికి గుర్తుగా ఊరి పేరు మార్పు
మృతుడు లక్ష్మణరావు విజయవాడ వాసి కాగా, హత్యకు పాల్పడిన మణిరత్నం అనంతపురం జిల్లా గుంతకల్లు వాసిగా పోలీసులు గుర్తించారు. మణిరత్నంపై గతంలోనూ పలు కేసులు వున్నాయి. గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఇదివరకే రౌడీషీట్ తెరిచారని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన డి.ఎస్.పి నరసప్ప వివరాలు వెల్లడించారు.
నకిలీ మందులమ్మిన వ్యాపారికి జరిమానా
ఆరుగాలం శ్రమించిన రైతుకి నకిలీ విత్తనాలు శాపంగా మారుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ మందులతో మోసపోయానంటూ ఆక్వారైతు ఆవేదన చెందుతున్నాడు. కాట్రేనికోనకు చెందిన రైతు శ్రీనివాస్ అమలాపురంలో ఆగ్రో ఏజెన్సీ వద్ద మందులు కొనుగోలు చేసి ఆక్వా పంట వేశారు. అయితే, ఆయన వేసిన మందులు నకిలీవిగా గుర్తించి మత్సశాఖ అధికారులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు వ్యాపారికి లక్షరూపాయలు జరిమానా విధించారు. నకిలీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు వ్యాపారులకు హెచ్చరికలు జారీచేశారు.
Read Also: Stuart Broad: పెళ్లికి ముందే తండ్రి అయిన ఇంగ్లండ్ క్రికెటర్