Tirupati: తిరుపతి నగరంలో ఈరోజు తెల్లవారుజామున తీవ్ర విషాదం జరిగింది. మంగళం సమీపంలోని కోళ్ల ఫారాం దగ్గర నివాసముంటున్న ఉష అనే మహిళను ఆమె భర్త లోకేశ్వర్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిసరా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఉష తిరుపతిలోని అమరరాజా కంపెనీలో ఉద్యోగిగా డ్యూటీ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష, లోకేశ్ దంపతుల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున ఉద్యోగానికి వెళ్లుతున్న ఉషను లోకేశ్ రోడ్డుపై అడ్డుకుని కత్తితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచే పరారయ్యాడు.
Read Also: Sreeleela : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..
ఇక, ఈ ఘటనపై స్పందించిన ఉష తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాం.. కేవలం అనుమానంతోనే మా అల్లుడు ఆమె ప్రాణం తీశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే, మృతురాలు ఉష కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మకు నాన్న అంటే ఇష్టం లేదు.. ఆయన చేసే పని తీరు నచ్చకపోవడం వల్ల విడిపోవాలని అనుకుంది.. కానీ విడిపోవడానికే ముందు అమ్మను చంపేశాడు అని కన్నీరు పెట్టుకున్నాడు. అయితే, హత్య జరిగినత తర్వాత లోకేశ్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.