తిరుమలలో స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలో హిందూ ధార్మిక ప్రచారానికి కొత్త ఒరవడి సృష్టించాలన్నారు స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలోని హరిజన,గిరిజన వాడలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని గట్టిగా నిర్వహించాలన్నారు. హరిజన, గిరిజన వాడలలో ఇతర మతస్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
స్వధర్మ వాహిని ద్వారా తెలుగు రాష్ర్టాలలో….అటు తరువాత దక్షిణాది రాష్ట్రాలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు స్వరూపానంద స్వామీజీ. టీటీడీకి విశాఖ పీఠానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది మా ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తాం అని స్పష్టం చేశారు స్వరూపానంద స్వామీజీ. తిరుపతి పర్యటనలో ఆయన వివిధ దేవాలయాలను సందర్శించారు. విశాఖ శారదా పీఠాధిపతి మూడురోజుల పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మ వారి రుద్రాభిషేకంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి.అనంతరం తిరుపతిలో గంగమ్మకు సారెను సమర్పించారు.
Bandi Sanjay కేసీఆర్ నిర్ణయాలతో రైతులు బికారులు అవుతున్నారు