Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. జనవరి కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే..

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఆర్జిత సేవాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం వచ్చిన తర్వాత.. భక్తులు టికెట్లను ఆన్‌లైన్‌ లోనే బుక్‌చేసుకుంటున్నారు.. ఇక, ఎప్పుడు అధికారులు టికెట్లను ఆన్‌లైన్‌లో పెడతారా? బుక్‌ చేసుకోవాలా? అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.. ఆ సమయం రానేవచ్చింది.. డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. 2023 జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది టీటీడీ.. అదేవిధంగా, 2023 జనవరి నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంట‌ల‌ నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుందని.. ఆ తర్వాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయిస్తారని.. భక్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాలని సూంచింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

Read Also: Ishan Kishan: ఇ‘షాందార్’ పెర్ఫార్మెన్స్.. ద్విశతకంతో బంగ్లాపై విశ్వరూపం

Exit mobile version