Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirumala Mettu Route Damaged

Tirumala Mettu: శ్రీవారి మెట్టుమార్గానికి మోక్షం ఎప్పుడు?

Published Date :April 3, 2022 , 8:52 am
By NTV WebDesk
Tirumala Mettu: శ్రీవారి మెట్టుమార్గానికి మోక్షం ఎప్పుడు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు.

కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో ఏడుకొండలవాడి చెంతకు చేరుకుంటారు. తిరుమల చేరుకోవడానికి ఉన్నవి రెండు నడకమార్గాలు. ఒకటి అలిపిరి, మరోక్కటి శ్రీవారి మెట్టు మార్గం. తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉండేది ఈ శ్రీవారి మెట్టు నడకమార్గం, పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తరువాత సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లు కొండపైకి నడిచివెళ్లిన మార్గం కాబట్టే దానికి శ్రీవారి మెట్టు నడకమార్గంగా ప్రసిద్ధి చెందింది‌.

ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నడకమార్గం గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. దాదాపు 500 పైగా మెట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నాలుగు కల్వర్ట్‌లతో పాటు మెట్లకు ఇరువైపులా ఉండే రిటైనింగ్ వాల్స్ ధ్వంసమైపోయాయి. వరద ప్రభావంతో శ్రీవారి మెట్టు నడకమార్గం గుర్తుపట్టలేనంత.. పెద్దపెద్ద బండరాళ్లు, గుండులు, మట్టిపెళ్లలు, కొండచరియలతో నిండిపోయింది. తిరుమల చరిత్రలో మొదటిసారి మెట్లమార్గం‌ భారీస్థాయిలో దెబ్బతింది.

దీంతో గత ఏడాది నవంబర్ 19వ తేదీ శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో రోజూ టీటీడీ 6వేల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చెసేది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసి వేయడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వచ్చే గోవింద మాలధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

ఇక నెల రోజుల్లో శ్రీవారిమెట్టు మార్గం పనులు పునరుద్ధరణ చేస్తామని చెప్పారు అధికారులు.. అయితే 5 నెలల గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు. 800వ మెట్టు, 1200వ మెట్టు వద్ద 30 అడుగుల వెడల్పు, 30అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని పునర్నిర్మాణం చేయడానికి చాలా సమయం పట్టేట్లు ఉంది. మరో 2 నెలల గడిచినా పనులు పూర్తయ్యే అవకాశం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు భక్తులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • balaji darshan
  • damaged steps
  • rains
  • sevenhills

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions